ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. బ్రిట‌న్ ప్ర‌ధానిగా రిషి సునాక్

-కిందటి సారి రెండో స్థానంలో నిలిచిన రిషి
-లిజ్ ట్రస్ రాజీనామాతో మరోసారి ఎన్నికలు

Rishi Sunak as Prime Minister of Britain : భార‌తీయుల‌కు దీపావ‌ళి పండ‌గ రోజు మంచి శుభ‌వార్త… మ‌న దేశాన్ని దాదాపు 200 ఏండ్లు పాలించిన దేశానికి మ‌న సంత‌తికి చెందిన వ్య‌క్తే ప్ర‌ధాని అయ్యాడు. వ్యాపారం పేరుతో వ‌చ్చి మ‌న‌ల్నే ప‌రిపాలించిన బ్రిటిష్ దేశానికి మ‌న సంత‌తి వ్య‌క్తి రిషి సునాక్ ప్ర‌ధానిగా ఎన్నిక‌య్యాడు. అది కూడా దీపావ‌ళి రోజు..

బ్రిటన్ కొత్త ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ ఎన్నికయ్యాడు. లిజ్ ట్రస్ తన పదవికి రాజీనామా చేయడంతో 177 మంది ఎంపీలు రిషికి మద్దతు తెలిపారు. దీంతో అతను ప్రధానిగా ఎన్నికయ్యాడు. రిషి. . సునాక్ బ్రిటన్ ప్రధానిగా పదవి చేపట్టిన మొదటి భారత సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. బ్రిట‌న్ ప్ర‌ధాని లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రకటించారు. అయితే రిషికి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి తీవ్ర పోటీ ఎదురతుందని భావించినా ఆయన అనూహ్యంగా బరి నుంచి తప్పుకున్నారు. రిషి సునాక్ కంటే వెనుకబడి ఉన్న బోరిస్ జాన్సన్.. పోటీపడి పరువు పోగొట్టుకోవడం కంటే తప్పుకోవడమే మేలని భావించారు. అదే స‌మ‌యంలో బ్రిటన్ మాజీ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ సైతం రిషికి మద్దతు ఇచ్చారు. దీంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కైంది.

ప్రధాని పీఠం లిజ్ ట్రస్‌తో జరిగిన పోటీలో రన్నరప్‌గా నిలిచిన సునాక్‌కు.. కొద్ది వారాల వ్యవధిలోనే అదృష్టం మళ్లీ తలుపుతట్టింది. ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌‌ ఆమె పదవికి ఎసరు పెట్టింది. బడ్జెట్ వల్ల ప్రయోజనం కలగకపోగా.. ద్రవ్యోల్బణం మరింత పెరిగిపోవడంతో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. దీంతో పార్టీపై ఆమె పట్టుకోల్పోయి చివరకు ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా, మొత్తం 357 మంది టోరీ ఎంపీల్లో సగం మందికి పైగా మద్దతును పొందడం ద్వారా బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగానూ రిషి సునాక్‌ (42) అరుదైన రికార్డు సొంతంచేసుకోవడం విశేషం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like