రోడ్డు ఆక్ర‌మిస్తున్నారు.. కాపాడండి..

మంచిర్యాల జిల్లాలో ఏకంగా రోడ్డే ఆక్ర‌మించుకుంటున్నారు కొంద‌రు వ్య‌క్తులు.. ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఇంత జ‌రుగుతున్నా మున్సిప‌ల్ అధికారులు క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం ప‌ట్ల ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ని ల‌క్ష్మీనగర్ కాలనీ, 28వ వార్డు రోడ్ నెంబర్ 5 లో 60 ఫీట్ల రోడ్డు ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వుతోంది. దీనిపై క‌న్నేసిన కొంద‌రు వ్య‌క్తులు దీని ఆక్ర‌మ‌ణ‌కు ఎన్నో రోజులుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. కొద్ది రోజులుగా కార్ షెడ్ పేరుతో ఏకంగా 60 ఫీట్ల రోడ్డు స్థ‌లాన్ని ఆక్ర‌మించారు. దీనిపై అధికారులు సైతం చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేస్తున్నారు. ఈ విష‌య‌మై రోడ్డు కాపాడాల‌ని శుక్ర‌వారం కాల‌నీవాసులు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ బాలకృష్ణకి విన‌తిప‌త్రం అందించారు. ఏకంగా రోడ్డుపైనే షెడ్ నిర్మించిన వారిపై చట్టప్రకారం కోరారు. విన‌తిప‌త్రం అందించిన వారిలో సింగరేణి రిటైర్‌మెంట్ కార్మిక సంఘం అధ్యక్షుడు గజేల్లి వెంకటయ్య, మాజీ ఎంఈవో రాజేశం గౌడ్, కాల‌నీ వాసులు చిప్పరామస్వామి, మామిడాల సత్యనారాయణ వినతి పత్రం అందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like