రూటు మార్చి… గోడ దూకి….

-మ‌హారాష్ట్ర నుంచి బాస‌ర వ‌చ్చిన పీసీసీ చీఫ్‌
-బాసరలో రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-లోకేశ్వ‌రం పోలీస్‌స్టేష‌న్ త‌ర‌లింపు

మాస్కు వేసుకుని.. రూటు మార్చి మ‌రీ పీసీసీ చీఫ్ బాస‌ర ట్రిపుల్ ఐటీకి వెళ్లారు. అక్క‌డ క్యాంప‌స్ లోపలికి చేరుకున్న ఆయ‌న విద్యార్థుల వ‌ద్ద‌కు వెళ్లే క్ర‌మంలో పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా బాస‌ర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు రేవంత్‌రెడ్డి శుక్రవారం బాస‌ర‌కు వ‌చ్చారు. మహారాష్ట్రలోని ధర్మబాద్, బాలాపూర్ మీదుగా ట్రిపుల్ ఐటీ వద్దకు చేరుకున్నారు. కాలినడకన చెరువులో నుండి నడుచుకుంటూ వ‌చ్చారు. పోలీసుల కళ్ళుగప్పి క్యాంపస్ వెనుక గోడదూకి లోనికి చేరుకున్నారు. లోప‌ల విద్యార్థులు ఉన్న ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయ‌న పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న‌ను ప‌ట్టుకోవ‌ద్ద‌ని మీ ఆఫీస‌ర్ ఎవ‌రో వారితో మాట్లాడ‌తాన‌ని వాగ్వావాదానికి దిగారు. అయినా పోలీసులు ఒక్కసారిగా చుట్టు ముట్టి వాహనంలో ఎక్కించి లోకేశ్వరం పోలీస్ స్టేషన్ తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like