చెన్నూరుకు… ఇన్నూరు కోట్లు..

-రూ. 204 కోట్లు, 29 ప‌నుల‌కు శంకుస్థాప‌నలు
-చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి హ‌రీష్‌రావు చేతుల మీదుగా ప్రారంభం
-సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయనున్న త‌న్నీరు
-ప్రారంభోత్స‌వాలు, పంపిణీ కార్య‌క్ర‌మాలు
-అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
-ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించిన ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌

Chennur : చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో బుధ‌వారం వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సుడిగాలి ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రారంభోత్స‌వాలు, పంపిణీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు. నియోజ‌క‌వ‌ర్గంలో రూ.204.10 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వాల‌తో పాటు, ప్ర‌భుత్వ ఆర్థిక ప్ర‌యోజ‌నాల చెక్కులు పంపిణీ చేస్తారు. ఆయ‌న‌తో పాటు మ‌రో మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి కూడా కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. మంత్రి ప‌ర్య‌ట‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ మంగ‌ళ‌వారం ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు.

జైపూర్ మండలం ఇందారం (IK OCP) వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి, ఇందారం, రామారావ్ పేట్ చెరువు కట్ట వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా భీమారం, జైపూర్ మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ పనులు, జోడువాగుల (Y జంక్షన్) వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అర్బన్ ఎకో పార్క్, చెన్నూరు పట్టణంలో నాలుగు లైన్ల ప్రధాన రహదారి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

బుధ‌వారం మంత్రి ప్రారంభించనున్న అభివృద్ధి ప‌నుల వివ‌రాలు..
– జైపూర్ మండలం ఇందారం (IK OCP) వద్ద 37.50 కోట్లతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం.
– జైపూర్ మండలం.. ఇందారం నుండి రామారావ్ పేట్ వరకు 2.80 కోట్లతో నిర్మించిన చెరువు కట్ట అభివృద్ధి, బీటీ రోడ్డు ప్రారంభోత్సవం.
– ఇందారంలో రూ.4.60 కోట్లతో పలు అభివృద్ధి పనులతో పాటు గ్రామ సుందరీకరణ పనులకు శంకుస్థాపన.
– పెగడపల్లి వద్ద ఈదుల వాగుపై రూ.3 కోట్లతో నిర్మించే బ్రిడ్జి పనులకు శంకుస్థాపన.
– జైపూర్ మండల కేంద్రంలో రూ. 2.30 కోట్లతో కేజీబీవీ పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన.
– జైపూర్, భీమారం మండల కేంద్రాలలో రూ.5.80 కోట్లతో నూతనంగా నిర్మించిన సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం.
– జోడువాగుల (Y జంక్షన్) వద్ద రూ. 2 కోట్లతో 250 ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అర్బన్ ఎకో పార్క్ ప్రారంభోత్సవం.
– చెన్నూరులో రూ.21.70 కోట్లతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ప్రభుత్వ దవాఖానకు శంకుస్థాపన.
– చెన్నూరులో రూ.4 కోట్లతో నూతనంగా నిర్మించనున్న “చెన్నూర్ బస్ డిపో” నిర్మాణానికి శంకుస్థాపన.
– చెన్నూరు నడిబొడ్డున ఏడు కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న CHC సెంటర్లో అదనంగా రూ. 2.97 కోట్లతో పలు పనులకు శంకుస్థాపన.
– చెన్నూరులో రూ.2.65 కోట్లతో 6.34 ఎకరాల్లో నిర్మించిన మినీ స్టేడియం ప్రారంభోత్సవం, రూ.1.70 కోట్లతో స్టేడియంలోని పలు పనులకు శంకుస్థాపన.
– చెన్నూరులో మూడు కోట్లతో అభివృద్ధి చేసిన కుమ్మరి కుంట చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
– చెన్నూరులో రూ.18 కోట్లతో నూతనంగా నిర్మించిన నాలుగు లైన్ల ప్రధాన రహదారి, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవం.
– చెన్నూరులో రూ.2.50 కోట్లతో 2 ఎకరాల్లో నూతనంగా నిర్మించిన KCR పార్క్ ప్రారంభోత్సవం.
– చెన్నూరులో రూ.6 కోట్లతో అభివృద్ధి చేసిన పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
– చెన్నూరులో రూ.1.50 కోట్లతో నూతనంగా నిర్మించిన డంపింగ్ యార్డ్ ప్రారంభోత్సవం, FSTP శంకుస్థాపన.
– చెన్నూరులో రూ.7.20 కోట్లతో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవం.
– చెన్నూరు పట్టణంలో రూ.1.50 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న సమ్మక్క-సారలమ్మ మహిళా భవనానికి శంకుస్థాపన.
– చెన్నూరు నియోజకవర్గం లోని 77 గ్రామపంచాయతీలలో రూ.13.86 కోట్ల నిధులతో 77 సమ్మక్క సారలమ్మ మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన.
– చెన్నూరు నియోజకవర్గంలోని 100 గ్రామపంచాయతీలలో రూ. 4 కోట్ల రూపాయలతో 100 లైబ్రరీలకు శంకుస్థాపన.
– చెన్నూరు పట్టణంలో రూ.17.52 కోట్ల నిధులతో 99.98 కిలోమీటర్ల మేర పైప్లైన్, 10 నీటి ట్యాంకుల నిర్మాణాలతో 7629 గృహాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే మిషన్ భగీరథ నీటి సరఫరా ప్రారంభోత్సవం.
– అనంతరం చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో చెన్నూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం, సభ.
– 17,899 మంది లబ్ధిదారులకు 4.79 కోట్ల అభయహస్తం నిధుల విడుదల, 24,440 మంది లబ్ధిదారులకు రూ. 3.36 కోట్ల విలువగల చెక్కుల పంపిణీ.
– 2016 నుంచి 2021 వరకు 38,556 మంది బీడీ కార్మికులకు 18.11 కోట్ల విలువగల చెక్కుల పంపిణీ.
– చెన్నూరు పట్టణంలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన.
– చెన్నూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాకవి వానమామలై వరదాచార్యులు వారి విగ్రహ ప్రతిష్టాపన.
– మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like