రూ. 250 కోట్ల తునికాకు బోన‌స్ అందించాం

అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి

Minister Indhrakaran Reddy: బీడీ సేక‌ర‌ణ‌లో కూలీల‌కు ఇచ్చే రేట్లు కట్టకు రూ.2.05 పైసల నుంచి రూ.3కు పెంచామ‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలలో కూలీల‌కు గురువారం బోనస్ చెక్కులు అందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఏజెన్సీలో తునికాకు సేకరణ రెండో పంటగా, ఆర్థిక వనరుగా ఉపయోగపడుతుంద‌న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2016 నుంచి 2021 వరకు రూ.250 కోట్లను బోన‌స్ చెల్లిస్తున్నామని వివరించారు.

1.50 ల‌క్ష‌ల మందికి పోడు వ్యవసాయ పట్టాలు అందిస్తామ‌ని మంత్రి ఈ సంద‌ర్భంగా హామీ ఇచ్చారు. హ‌రిత‌హారం కింది .రూ 230 కోట్లతో మొక్కలు నాటామ‌న్నారు. తెలంగాణలో మత్స్యసంపద విపరీతంగా పెరిగిందని ఈ సంద‌ర్భంగా మంత్రి గుర్తు చేశారు. ఇక ప్రతి నియోజకవర్గంలో 1100 కుటుంబాలకు దళితబంధు ఇస్తామ‌ని అల్లోల స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, జిల్లా పరిషత్ జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రేణికుంట్ల ప్ర‌వీణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like