రూ. 800 కోట్ల‌తో… రాజ‌మౌళి-మ‌హేష్‌బాబు సినిమా

జ‌క్క‌న్న సినిమా అన‌గానే.. ఓ పెద్ద బ‌డ్జెట్‌, ఫాంట‌సీ సినిమా గుర్తుకు వ‌స్తుంది. ఆయ‌న‌ తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకుపోయారంటే ఆశ్చ‌ర్యం ఏం లేదు. ఇప్పుడు కూడా అదే చేయ‌బోతున్నారు. మ‌హేష్‌బాబుతో సినియా చేయ‌నున్న రాజ‌మౌళి ఆ సినిమా బ‌డ్జెట్ రూ. 800 కోట్లుగా పెట్టుకున్నారట‌. ఇప్పుడు సినీ ఇండ‌స్ర్టీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

ఒక‌ప్పుడు రూ. 100 కోట్ల‌తో సినిమా అంటే తెలుగు సినీ రంగంలో చాలా పెద్ద బ‌డ్జెట్‌. ఇప్పుడు అది రూ. 500 కోట్ల మార్కు దాటేసింది. రూ. 1000 కోట్ల దిశ‌గా వెళ్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాకు అక్ష‌రాలా రు. 450 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. అస‌లు ఓ ప్రాంతీయ భాషా సినిమాగా చూస్తే అంత బ‌డ్జెట్ వ‌ర్క‌వుట్ అవుతుందా ? అని లెక్క‌లు వేసుకుంటే.. ఈ సినిమాను ఏపీ, తెలంగాణ వ‌ర‌కు రు. 191 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేశారు. ప్ర‌స్తుతం ఆ సినిమా రూ. 500 కోట్ల వ‌ర‌కు వ‌సూలు చేసి క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తం ఏ మేర‌కు వ‌సూలు చేస్తుంద‌నేది చూడాలి.

త్రిబుల్ ఆర్ త‌ర్వాత మ‌హేష్‌బాబు – రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలు ఎక్క‌నుంది. ఈ సినిమాకు అక్ష‌రాలా రు. 800 కోట్ల పెట్టుబ‌డి పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా క‌థ‌, జాన‌ర్ ఏంటి అన్న‌ది ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వచ్చేసింది. ఈ సినిమా స్టోరీ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ కూడా ఈ సినిమా ఆఫ్రికా నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ అని చెప్పేశారు. జేమ్స్‌బాండ్ స్టైల్లో సినిమా క‌థ న‌డుస్తుంద‌ని.. మ‌హేష్‌బాబు క్యారెక్ట‌ర్ కూడా జేమ్స్‌బాండ్ లాగానే ఉంటుంద‌ని అయితే వార్త‌లు వ‌స్తున్నాయి. జేమ్స్‌బాండ్ క‌థ అంటే అందుకు త‌గిన బ‌డ్జెట్ ఉండాలి.. ఆఫ్రికాలోని కెన్యా, ఆఫ్రికా ఫారెస్టుల్లోనే ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు షూట్ చేస్తార‌ట‌. ఇక బ‌డ్జెట్ రు. 800 కోట్లు అంటే.. అస‌లు ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే ఇది చివ‌రి క్ష‌ణాల్లో పెరిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు.

రాజ‌మౌళి త్రిబుల్ ఆర్ సినిమానే రు. 250 కోట్ల బ‌డ్జెట్‌తో తీయాల‌ని అనుకున్నాడు. అయితే అది చివ‌ర‌కు రు. 450 కోట్లు క్రాస్ అయ్యింది. రాజ‌మౌళి న‌మ్మ‌కం ఏంటంటే ఇండియ‌న్ సినిమా బాక్సాఫీస్ స్టామినా రు. 2 వేల కోట్లు అని.. బాహుబ‌లి 2 వ‌సూళ్లే ఆ రేంజ్‌లో ఉండ‌డంతో అదే టార్గెట్‌గా పెట్టుకున్నాడు. ఇక మ‌హేష్ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో తెర‌కెక్కించ‌డంతో పాటు హాలీవుడ్లోనూ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నాడు. దేశంలోని అన్ని భాష‌ల‌తో పాటు ఇంగ్లీష్ వెర్ష‌న్‌లో హాలీవుడ్‌లో రిలీజ్ చేస్తే ఈ సినిమా వ‌సూళ్లు మ‌రో రేంజ్‌లో ఉంటాయ‌న్న‌దే రాజ‌మౌళి న‌మ్మ‌కం అట‌. ద‌స‌రాకు రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా ప‌ట్టాలు ఎక్క‌నుంది. ఏదేమైనా రాజ‌మౌళి మ‌రోసారి మ‌హేష్ సినిమాతో సంచ‌ల‌నానికి రెడీ అవుతున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like