స‌ఖి కేంద్రంలో సౌక‌ర్యాలు క‌ల్పిస్తాం

మంచిర్యాల జిల్లా అడిష‌న‌ల్ క‌లెక్ట‌ర్ మ‌ధుసూద‌న్ నాయ‌క్‌

మంచిర్యాల: స‌ఖి కేంద్రంలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని మంచిర్యాల జిల్లా అడిష‌న‌ల్‌ క‌లెక్ట‌ర్ మ‌ధుసూద‌న్ నాయ‌క్ హామీ ఇచ్చారు. ఆయ‌న గురువారం స‌ఖి కేంద్రాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ మ‌హిళ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో స‌ఖి కేంద్రం కోసం నూత‌న భ‌వ‌నం నిర్మించిన‌ట్లు చెప్పారు. కొత్త భ‌వ‌నం కావ‌డంతో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న పూర్తి కాలేద‌న్నారు. స‌ఖి కేంద్రం చుట్టూ ప్ర‌హ‌రీ నిర్మాణంతో పాటు భ‌వ‌నానికి విద్యుత్ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌న్నారు. అంతేకాకుండా భ‌వ‌నానికి తాగు నీటి సౌక‌ర్యం సైతం ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆయ‌న స‌ఖి కేంద్రానికి వ‌చ్చిన సంద‌ర్బంగా సీఏ శ్రీ‌ల‌త‌, ఇత‌ర సిబ్బంది పుష్ప‌గుచ్ఛంతో స్వాగ‌తం ప‌లికారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like