సమ్మె జయప్రదం చేయండి

కైరిగుడ ఓపెన్ కాస్ట్ గేట్ మీటింగ్ లో కార్మిక సంఘాల నాయకుల పిలుపు

పైవేటికరణ వ్యతిరేకిస్తూ చేపట్టిన సమ్మె విజయవంతం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి ఏరియా కైరిగుడ ఓపెన్ కాస్ట్ గనిలో గేట్ మీటింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఐన్టీయూసీ సీనియర్ ఉపాదక్షుడు సిద్దంశేట్టి రాజమౌళి మాట్లాడుతూ ప్రస్తుతం కార్మిక వర్గం అనుభవిస్తున్న ప్రతి హక్కు సౌకర్యాలు కార్మికుల పోరాట ఫలితమే అన్నారు. మోడీ ప్రభుత్వం సింగరేణిలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ చేస్తోందని దానిని తిప్పికొట్టాలని అన్నారు. ఇప్పుడు నాలుగు బ్లాకులే అని ఊరుకుంటే మొత్తం సంస్థనే అమ్మేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో ఇక ఏ హక్కులు ఉండవని అన్నారు. సమ్మె ద్వారానే పాలకులకు గుణపాఠం చెప్పాలని అన్నారు. ఏఐటీయూసీ నేత బాజి సైద ప్రసంగిస్తూ మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మారుస్తోన్నది అన్నారు. కార్మికులు పోరాడే హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు అల్లి రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్రం పై ఒత్తిడి తెచ్చి బొగ్గు గనుల ప్రైవేటుకరణ ఆపాలన్నారు. కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చాలని కోరారు సింగరేణి యాజమాన్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించి 12 డిమాండ్స్ ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కార్మికులను ఉద్దేశించి సమ్మెను విజయవంతం చేయాలని 12 డిమాండ్స్ సాధించుకోవాలని హెచ్ఎంఎస్, టీబీజీకేఎస్ నాయకులు కార్మికులకు పిలుపునిచ్చారు సమావేశంలో ఐఎన్టీయూసీ ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్, ఏరియా సెక్రెటరీ మాధవ కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు శేషు, రాంచందర్. హెచ్ఎంఎస్ నాయకులు ఎండీ ఓజియర్, శంకరయ్య నాయకులు పాల్గొన్నారు. అనంతరం సమ్మె పోస్టర్లను విడుదల చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like