స‌మ్మెపై నేడు చ‌ర్చ‌లు

సింగ‌రేణి కార్మిక సంఘాల‌తో సోమ‌వారం ఆర్ఎల్ సీ చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఈ చ‌ర్చ‌ల్లో స‌మ్మె నోటీసు ఇచ్చిన ఆరు కార్మిక సంఘాలు పాల్గొంటాయి. సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాక్ల్ ల‌ను ప్రైవేటీక‌రించ‌వ‌ద్ద‌ని, సింగరేణికే కేటాయించాల‌ని లేకపోతే 9,10,11 తేదీల్లో సమ్మెకు దిగుతామ‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘంతో స‌హా ఐఎన్‌టీయూసీ,ఏఐటీయూసీ,సీఐటీయూ,బీఎంఎస్‌,హెచ్ఎంఎస్ యాజ‌మాన్యానికి నోటీసు ఇచ్చాయి. ఈ మేర‌కు సింగ‌రేణి యాజ‌మాన్యం కూడా కార్మిక సంఘ నేత‌ల‌ను పిలిచి మాట్లాడింది. స‌మ్మె విర‌మించుకోవాల‌ని యాజ‌మాన్యం స్ప‌ష్టం చేసింది. త‌మ డిమాండ్లు నెర‌వేరేంత వ‌ర‌కు స‌మ్మె ఆలోచ‌నపై వెన‌క్కి త‌గ్గేది లేద‌ని కార్మిక సంఘ నేత‌లు స్ప‌ష్టం చేశారు. ఈ రోజు ఆర్ఎల్ సీ నిర్వ‌హించే స‌మావేశంలో కూడా ఏం తేలే అవకాశం క‌నిపించ‌డం లేదు.

కార్మిక లోకం స‌మ్మెకు సిద్ధంగా ఉండాలి – జ‌న‌క్ ప్ర‌సాద్, సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్‌,ఐఎన్‌టీయూసీ
ఈ రోజు ఆర్ ఎల్‌సీతో నిర్వ‌హించే స‌మావేశంలో ఆరు కార్మిక సంఘాలు పాల్గొంటాయి. RLC మధ్యవర్తిత్వం చేసి సమ్మెపై ప్రభుత్వాన్ని ఒప్పించాలి. లేక‌పోతే స‌మ్మెకు కార్మిక లోకం సిద్ధంగా ఉండాలి. స‌మ్మె నోటీసులో మేం ఇచ్చిన అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాల్సిందే.

Get real time updates directly on you device, subscribe now.

You might also like