స‌న్నాసి బ‌య‌ట తిరుగుతున్న‌డు..

రేవంత్‌రెడ్డి చిల‌క‌జోస్యం చెప్పుకుంటే బెట‌ర్‌ ద‌మ్ముంటే హుజురాబాద్‌లో డిపాజిట్లు తెచ్చుకోవాలి మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు

హైద‌రాబాద్ ః కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న సన్నాసి బయట తిరుగుతున్నాడని రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయ‌న మంగ‌ళ‌వారం తెలంగాణ‌భ‌వ‌న్‌లో మాట్లాడారు. రేవంత్ కు దమ్ము ఉంటే హుజురాబాద్ లో డిపాజిట్లు తెచ్చుకోవాలన్నారు. ఆయ‌న చిల‌కజోస్యం చెప్పుకుంటే బెట‌ర్ అని దుయ్య‌బ‌ట్టారు. టీఆరెస్ అనేది ఏదో గాలివాటం పార్టీ కాదన్నారు. ఎన్టీఆర్ తరువాత కేసీఆర్ పార్టీ పెట్టి విజయం సాధించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. తెలంగాణ పథ‌కాలు భారతదేశానికి దిక్సూచిగా నిలిచాయన్నారు. హుజురాబాద్ ఎన్నిక తరువాత ఈటెల కాంగ్రేస్ లో చేరుతారట అని చెప్పారు. ఈటెల రాజేందర్ జానారెడ్డి కంటే పెద్ద నాయకుడా? ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడో చెప్పాడా? అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు. మంత్రిగా ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శలు చేశార‌ని దుయ్య‌బ‌ట్టారు. తాను గెలిస్తే ప్ర‌జ‌ల‌కు ఏం వ‌స్తుందో ఆయ‌న ఎందుకు చెప్ప‌డం లేద‌న్నారు. దళితబంధు ఎవరు ఆపినా ఆగదన్నారు. రాజకీయాల్లో ఛాలెంజ్ లకు అర్థం లేకుండా పోతుంది హుజురాబాద్ లో కాంగ్రేస్- బీజేపీ కుమ్మక్కు అయ్యాయన్నారు. కాంగ్రేస్ హుజురాబాద్ లో డమ్మీ అభ్యర్థిని ఎందుకు పెట్టారని ప్ర‌శించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like