స‌రైన‌ వైద్య సౌకర్యాలు అందించాలి

టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్ రావు

మంచిర్యాల : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి,. మాదారం టౌన్‌షిప్‌, బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లో కార్మికులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు సెంట్రల్ కమిటీ చీఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్ రావు కోరారు. మంగళవారం గోలేటి లోని డిస్పెన్సరీ సందర్శించడానికి వచ్చిన చీఫ్ మెడికల్ వెంకటేశ్వరరావును క‌లిసి ప‌లు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో ఉన్న గోలేటి లో తీవ్రమైన వ్యాధులు వచ్చినప్పుడు కరీంనగర్ లేదా హైదరాబాద్ హాస్పిటల్ లకు సులువుగా రిఫరల్ చేసే అధికారం స్థానిక డాక్టర్లకు ఇవ్వాలని కోరారు. మాదారం టౌన్షిప్‌, బెల్లంపల్లి హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలన్నారు. పారామెడికల్ సిబ్బందిని సరిపోయే విధంగా కేటాయించాలని కోరారు. రోగులకు సరైన మందులు అందే విధంగా చూడాలన్నారు. కేసీఆర్ కార్మికులకు అందించిన తండ్రి కొడుకుల ఉద్యోగం కోసం నిర్వహించే మెడికల్ బోర్డు లను నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ శౌరి, మెడికల్ ఆఫీసర్ స్టాలిన్, సీనియర్ స్టాఫ్ నర్స్ జయశీల టీబీజీకేఎస్ నాయకులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like