తైద‌ల బాపు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సేవా కార్య‌క్ర‌మాలు

-మాదారం టౌన్షిప్‌లో ర‌క్త‌దాన శిబిరం
-జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మ‌జ్జిగ పంపిణీ
-బెల్లంప‌ల్లిలో అన్న‌దాన కార్య‌క్ర‌మం, చ‌లివేంద్రం ప్రారంభం

సినీ గేయ ర‌చ‌యిత తైద‌ల బాపు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా బాపు యువ‌సేన ఆధ్వ‌ర్యంలో బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌లు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో ర‌క్త‌దాన శిబిరం ఏర్పాటు చేసి 30 యూనిట్ల ర‌క్తాన్ని సేక‌రించారు. శిబిరంలో తాండూర్ సర్పంచ్ నవీన్ కుమార్ తో పాటు పలువురు అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం కేక్ క‌ట్ చేసి బాపుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. పలువురు మాట్లాడుతూ తైదల బాపు సినీ రంగంలో మరింత ఎత్తుకు ఎదగాలని ఆయురారోగ్యలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్య‌క్ర‌మంలో సర్పంచులు ధ‌రావ‌త్ సాగ‌రిక‌, న‌వీన్‌కుమార్‌, టీబీజీకేఎస్ నేత మంగీలాల్‌, కాపర్తి సుభాష్, అభినవ సంతోష్ కుమార్, తైదల శ్రీనివాస్, తలసేమియా సొసైటీ సభ్యులు శ్రీనివాస్ రంజిత్ కుమార్, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది విజయ్, మాధవి, నాయకులు ఎర్రయ్య, రాజేందర్, రాజమణి, బోడ సతీష్, క్రాంతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

బెల్లంప‌ల్లిలో అన్న‌దానం, చ‌లివేంద్రం ప్రారంభం
బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలో అన్న‌దానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అమ్మఒడి స‌భ్యుల‌తో క‌లిసి ఈ అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అనంత‌రం ఇక్క‌డ చ‌లివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా బెల్లంప‌ల్లి ఆర్డీవో శ్యామ‌ల‌, సీఐ జ‌గ‌దీష్ మాట్లాడుతూ సింగ‌రేణి ప్రాంతంలో పుట్టి ఇంత ఎత్తుకు ఎద‌గ‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఆయ‌న మ‌రిన్ని ఉన్న‌త శిఖ‌రాలు అధిరోహించాల‌ని ఆకాక్షించారు. కార్య‌క్ర‌మంలో తైద‌ల శ్రీ‌నివాస్‌, టెక్నో డ్యాన్స్ అకాడ‌మీ మ‌ధు, రాంచంద‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ
ఉద‌యం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు మ‌జ్జిగ పంపిణీ చేశారు. ఉపాధి ప‌ని జ‌రుగుతున్న స్థ‌లాల వద్ద‌కు ఈ మ‌జ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు కూలీలు మాట్లాడుతూ త‌మకు మ‌జ్జిగ పంపిణీ చేసిన తైద‌ల బాపు యువ‌సేన స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. బాపుకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో రేగుల శ్రీ‌నివాస్‌, ఎరుక‌ల శ్రీ‌నివాస్‌, పోగు ర‌వి, తైద‌ల శ్రీ‌నివాస్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఐబిలోని అభినవ చలివేంద్రం ద్వారా మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం, రస్నా పంపిణీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like