శబరిమల స‌న్నిధానం వ‌ద్ద పేలుడు పదార్ధాల కలకలం

కేరళ రాష్ట్రంలోని శబరిమల ఆలయానికి సమీపంలో పేలుడు పదార్ధాలు కలకలం రేపాయి. తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే వంతెన కింద పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి.

ప్రసిద్ద పుణ్యక్షేత్రం శ‌బ‌రిమ‌ల‌కు సమీపంలో పేలుడు పదార్ధాలను బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. తిరువాభపురం ఊరేగింపు తిరుగు పయనయం కావడానికి కొద్ది గంటల ముందే ఈ పేలుడు పదార్ధాలు లభ్యం కావడం కలకలం రేపుతుంది. కేర‌ళ‌లోని పంథ‌న‌మిట్ట‌ జిల్లాలోని వడస్సెరిక్కరాలోని పెంగట్ వంతెన కింద ఆరు జిలెటిన్ స్టిక్స్ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.బ్రిడ్జి కింద పేలుడు పదార్ధాలను పోలీసులు గుర్తించారు.

పేలుడు పదార్ధాలను బాంబ్ స్వ్కాడ్ నిర్వీర్యం చేసింది. శబరిమల నుండి తిరువాభరణం మోసుకెళ్లే పేటికను ఈ నెల 21న తెల్లవారుజామున 4 గంటలకు ఈ రహదారి గుండా పందళానికి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ ఘటనపై తిరువాభరణం పథ పరిరక్షణ మండలి అధ్యక్షుడు పీజీ శశికుమార్ వర్మ, కార్యదర్శి ప్రసాద్ కుజిక్కులు ఆందోళన వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like