శ‌భాష్ క‌లెక్ట‌ర్‌..

ఉమ్మ‌డి ఆదిలాబాద్ ఎన్నిక‌ల్లో ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లారు ఆ క‌లెక్ట‌ర్‌.. విధి నిర్వ‌హ‌ణలో రాజీ ప‌డ‌కుండా నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హించారు. నామినేష‌న్ల విత్ డ్రా విష‌యంలో అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు ఎదురైనా వాటిని ప‌ట్టించుకోకుండా క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్ చాలా సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించారు. తుడుం దెబ్బ నేత పెందూర్ పుష్పారాణి తాను ప్ర‌పోజ‌ల్‌న‌ని ఆ నామినేష‌న్ ఉప‌సంహ‌రించుకునేందుకు వ‌చ్చిన‌ట్లు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి చెప్పారు. త‌న పేరు సంప‌త్ అని చెప్ప‌డంతో క‌లెక్ట‌ర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌కు అనుమానం వ‌చ్చింది. గిరిజ‌నుల్లో అలాంటి పేరు ఉన్న వారు ఉండ‌ర‌నేది తెలిసిన క‌లెక్ట‌ర్… పుష్పారాణి నామినేష‌న్ విత్ డ్రా చేయ‌కుండా అలాగే ఉంచారు. అదే స‌మ‌యంలో అభ్య‌ర్థితో త‌న‌కు ఫోన్ చేయించాల‌ని కోరారు. దీంతో ఖంగుతిన్న ఆ వ్య‌క్తి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. కొంద‌రు నేత‌లు సైతం ఆమెపై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేశారు. అయినా వెన‌క‌డుగు వేయ‌కుండా పుష్పారాణి బ‌రిలో ఉంటున్న‌ట్లు అధికార ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like