నాన్న‌ను చంపారు, నన్ను కూడా చంపుతారు

-న‌న్ను అరెస్టు చేయాల‌ని చూస్తున్నారు
-బేడీల‌కు నేను భ‌య‌ప‌డేదాన్ని కాదు
-వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్య‌లు

Sharmila accused that they will kill me like YSR: వైఎస్‌ఆర్‌ (YSR) మరణంపై తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర (Padayatra) చేస్తున్న ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ను కుట్ర చేసి చంపారని, తనను కూడా చంపాలని చూస్తున్నారని అన్నారు. తాను వైఎస్‌ఆర్‌ బిడ్డనని, భయం లేదని, ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ (CM KCR) గుర్తు పెట్టుకోవాలన్నారు. ఓ మహిళను ఎదుర్కోలేక స్పీకర్‌కు ఫిర్యాదు చేశారని, తనను అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారని, ఈ బేడీలకు తాను భయపడనని వైఎస్‌ షర్మిల స్పష్టం చేశారు. తాను బ్రతికినంతకాలం ప్రజల కోసం పోరాటం చేస్తానన్నారు. తనను ఎదుర్కోలేని దద్దమ్మలు పోలీస్ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.  తనను అవమానిస్తే వైఎస్సార్ బిడ్డగా తాను కేసు పెట్టినా పోలీసులు స్పందించలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కేసు పెట్టేందుకు ఎకమైన పాలమూరు ఎమ్మెల్యేలు.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడానికి ఏకమై ఉంటే బాగుండేదన్నారు.అవినీతిపై మాట్లాడితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులకు అంత భయమెందుకని షర్మిల ప్రశ్నించారు. తన పాదయాత్రను ఆపేందుకు ఎమ్మెల్యేలు కుట్రలు చేస్తున్నారని, తెలంగాణలో తాలిబన్ల రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. ‘‘ఒకడు మరదలు అంటాడు.. ఒకడేమో వ్రతాలు అంటాడు.. ఓ మంత్రి వ్యాఖ్యలపై నేను మాటలతోనే ఆగాను.. చేతలకు వెళ్లలేదు.. కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినవారిని అరెస్ట్‌ చేస్తున్నారు..పోలీస్‌ శాఖను టీఆర్ఎస్‌లో విలీనం చేయండి.. ఆర్‌ఎస్‌ఎస్‌లా టీఆర్ఎస్‌కు ఒక సైన్యంలా పనిచేయండి.’’ అంటూ షర్మిల వ్యాఖ్యానించారు…!!

Get real time updates directly on you device, subscribe now.

You might also like