కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం ఆమెకే..

Revanth Reddy: కేసీఆర్ ప్ర‌భుత్వం యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వ‌డం లేద‌ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. తాము అధికారంలోకి రాగానే యువ‌త‌కు పెద్దఎత్తున ఉద్యోగాలు సైతం ఇస్తామ‌ని హామీ ఇచ్చింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటు అయిన త‌ర్వాత మొట్ట‌మొద‌టి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వ‌నున్నారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడి హోదాలో మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఆమెకు ఉద్యోగం ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆమెకు ఆహ్వానం అందించారు.

తెలంగాణలో బుధ‌వారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. తెలంగాణ రెండ‌వ ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో వెల్లడించింది. అయితే తెలంగాణలో మొదటి ఉద్యోగం ఓ దివ్యాంగురాలికి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి ఉద్యోగం నీకే ఇస్తామని ఈ ఏడాది అక్టోబరు‌లో ఓ దివ్యాంగురాలికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభయ హస్తం అందించారు. పీజీ పూర్తి చేసినా ప్రైవేటులో, ప్రభుత్వంలో ఎక్కడా ఉద్యోగం రాలేదని హైదరాబాద్ నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజినీ అనే అమ్మాయి రేవంత్ రెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. రజినీ బాధ విన్న రేవంత్ రెడ్డి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని.. అదే రోజున కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఉద్యోగం నీకే ఇస్తుందని రజనికీ హామీ ఇచ్చారు.

ఇది తన గ్యారంటీ అని రేవంత్ స్పష్టం చేయటంతో పాటు స్వయంగా కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రజినీ పేరుతో రాసి ఇచ్చారు. కాగా, రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఆమెకు తొలి ఇద్యోగం ఉచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రేపు జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రజినికి ఆహ్వానం అందింది. రేపు ప్రమాణ స్వీకారం అనంతరం ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like