సింగ‌రేణి ఎన్నిక‌లు వాయిదా

Singareni: సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. నవంబరు 30న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సింగరేణి యాజమాన్యం ఎన్నికలను వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎన్నికలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలని యాజమాన్యం కోరింది. ఈ పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం సింగరేణి ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 27కు ఎన్నికలను వాయిదా వేసింది. నవంబరు 30వ తేదీలోగా ఓటర్ల జాబితాను రూపొందించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.

ఆరు జిల్లాల్లో సింగరేణి విస్తరించి ఉంది. మూడు జిల్లాల్లో మావోయిస్టుల ప్రభావం ఉన్న విషయాన్ని కూడ సింగరేణి అధికారులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి యాజమాన్యం చేసిన వినతి మేరకు తెలంగాణ హైకోర్టు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్లో సింగరేణిలో గుర్తింపు ఎన్నికల విషయమై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 22 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 7వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.ఈ నెల 9న నామినేషన్ల పరిశీలన కూడ జరిగింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కూడ కేటాయించారు. అయితే సింగరేణిలో ఎన్నికలను వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం ఈ నెల 5న హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ఎన్నికలను వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like