సింగరేణిలో కార్మికుల‌కు తీపి కబురు

-155 క్లర్క్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
-25 నుంచి ఆన్‌లైన్‌ లో దరఖాస్తుల స్వీకరణ
-భూగర్భ, ఓపెన్‌కాస్టు, డిపార్టుమెంట్లలో పనిచేస్తున్న అర్హులైన వారికి అవకాశం
-డైరెక్టర్‌ (పర్సనల్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్‌ వెల్లడి

మంచిర్యాల : సింగరేణి సంస్థలో బదిలీవర్కర్‌ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ఎన్‌.సి.డబ్ల్యు.ఎ. అభ్యర్థులకు యాజమాన్యం తీపికబురు తెలిపింది. సంస్థలో ఉన్న 155 క్లర్క్‌పోస్టుల (జూనియర్‌అసిస్టెంట్‌ గ్రేడ్‌-2) ఎన్‌.సి.డబ్ల్యు.ఎ. ఉద్యోగులతో భర్తీ చేయాలని నిర్ణయించింది. డైరెక్టర్‌ (పర్సనల్‌,ఫైనాన్స్‌, పిఅండ్‌పి) బలరామ్‌ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ వివరాలు వెల్లడిరచారు.

సింగరేణి వ్యాప్తంగా వివిధ గనులు, డిపార్ట్‌ మెంట్లలో ఉన్న 155 క్లర్క్‌ పోస్టులను ఇంటర్నల్‌ అభ్యర్థుల ద్వారా భర్తీ చేయడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా స్వీకరించనున్నారు.
-ఆన్‌ లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు వచ్చే నెల 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
-ఈ దరఖాస్తుల హార్డు కాపీలను అభ్యర్థులు జూన్‌ 25లోగా పోస్టు ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
-అండర్‌ గ్రౌండ్‌ ఉద్యోగులు ఏడాదిలో కనీసం 190 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. సర్ఫేస్‌ ఉద్యోగుల వారైతే ఏడాదిలో 240 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి.
-అలాగే అభ్యర్థులు ఏదైనా డిగ్రీని కనీస అర్హతగా కలిగి ఉండటంతోపాటు కంప్యూటర్‌ కోర్సులో 6 నెలల సర్టిఫికేట్‌ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
-అభ్యర్థులకు ఎలాంటి వయో పరిమితి లేదు
-దరఖాస్తుదారులు తాము పనిచేస్తున్న చోటు నుంచి సంబంధిత అధికారి ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు అతనికి సంబంధించిన వివరాలతో కూడిన రిపోర్టును కూడా జతపరిచి జీఎం (పర్సనల్‌) రిక్రూట్‌ మెంట్‌ సెల్‌ కు పంపిస్తారు.
-ఎంపిక విధానం: రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 95 శాతం పోస్టులను సింగరేణి విస్తరించిన నాటి ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన ఇన్‌ సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేయడం జరుగుతుంది. మిగిలిన 5 శాతం పోస్టులకు తెలంగాణ అన్ని జిల్లాల ఇన్‌ సర్వీస్‌ అభ్యర్థులు అర్హులు.
-అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష కోసం హాల్‌ టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. రాత పరీక్షకు 85 శాతం మార్కులు, అసెస్‌ మెంట్‌ రిపోర్టుకు 15 శాతం మార్కుల వెయిటేజ్‌ ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపి మెరిట్‌ జాబితాను ప్రకటించడం జరుగుతుంది.

ఇది సువర్ణావకాశం సద్వినియోగం చేసుకోండి : డైరెక్టర్‌ శ్రీ ఎన్‌.బలరామ్‌
సింగరేణి సంస్థలో విద్యార్హతలు, ప్రతిభను బట్టి మెరుగైన ఉద్యోగాలు కల్పించేందుకు సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ సంకల్పించారు. మొద‌ట‌ 155 క్లర్కు పోస్టులను ఇన్‌ సర్వీస్‌ అభ్యర్థులతో భర్తీ చేయాలని నిర్ణయించాం. ఇది విద్యావంతులైన అభ్యర్థులకు సువర్ణావకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పరీక్షలు, ఎంపికలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నాం. అభ్యర్థులెవరూ ఎటువంటి ప్రలోభాలకు గురికావొద్దు. క్రమశిక్షణ, ప్రతిభ కలిగిన వారికి సింగరేణిలో అవకాశాలు ఉంటాయి. ఎక్స్‌ టర్నల్‌ క్లర్క్‌ నోటిఫికేషన్‌ జారీ కోసం కూడా సన్నాహాలు ప్రారంభించాం. అతి త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేస్తాం.

Get real time updates directly on you device, subscribe now.

You might also like