సింగ‌రేణిలో సమ్మె సైర‌న్

ఐదు డిమాండ్ల‌తో నోటీసు సిద్ధం - టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ సమావేశంలో నిర్ణ‌యం

సింగరేణిలో స‌మ్మె సైర‌న్ మోగింది. తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ఐదు డిమాండ్ల‌తో కూడిన స‌మ్మె నోటీసు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం టెండర్ల తేదీలను ఖరారు చేసింది. ఈ బొగ్గుబ్లాకుల్లో నాలుగు సింగరేణి సంస్థ పరిధిలోవే ఉన్నాయి. దీనిపై ఉద్య‌మం చేయాల‌ని టీబీజీకేఎస్ నిర్ణ‌యం తీసుకుంది. గురువారం రామగుండం ఏరియాలో నిర్వహించిన కేంద్ర క‌మిటీ స‌మావేశంలో ప‌లు డిమాండ్ల‌పై స‌మ్మె నోటీసు సిద్ధం చేశారు. ఇందులో ప్ర‌ధానంగా బొగ్గు బ్లాకు ప్రైవేటీక‌ర‌ణ‌లో భాగంగా సింగరేణి కి సంబంధించిన నాలు బ్లాక్ లని వేలం నుండి తీసివేయ్యాలని ఈ సంద‌ర్భంగా డిమాండ్ చేశారు. ఉద్యోగాల విష‌యంలో డిపెండెంట్ వయో పరిమితిని 35 నుండి 40 కి మార్చి కారుణ్యం వర్తింపచేయాలని కోరారు. అదే స‌మ‌యంలో సింగ‌రేణిలో చాలా మంది పేర్లు అలియాస్ గా ఉన్నాయ‌ని ఈ మారు పేర్లు మార్చాలన్నారు. క‌రోనా వ‌ల్ల మెడిక‌ల్ బోర్డు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో 35 వయస్సు దాటిన వారసులకు కారుణ్య ఉద్యోగం ఇవ్వాలి కోరారు. తండ్రి చ‌నిపోయిన స‌మ‌యంలో ఆయ‌న భాగస్వామి ప్రభుత్వ సంస్థలలో ప‌నిచేస్తే డిపెండెట్స్‌కు ఉద్యోగాలు క‌ల్పించ‌డం లేదు. వారికి కూడా ఉద్యోగాలు అవ‌కాశాలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like