సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ‌కు కుట్ర‌

శ్రీ‌రాంపూర్ ఏరియా ఉపాధ్య‌క్షుడు కేతిరెడ్డి సురేంద‌ర్‌రెడ్డి

మంచిర్యాల : సింగ‌రేణి సంస్థ‌ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకే కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర‌లు ప‌న్నుతోంద‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం శ్రీ‌రాంపూర్ ఏరియా ఉపాధ్య‌క్షుడు కేతిరెడ్డి సురేంద‌ర్‌రెడ్డి ఆరోపించారు. బుధ‌వారం శ్రీ‌రాంపూర్ ఏరియా వ్యాప్తంగా గ‌నులు, ఓపెన్‌కాస్టులు, డిపార్ట‌మెంట్ల‌పై కేంద్ర ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను నరేంద్రమోడీ దోస్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్న‌ద‌ని దుయ్య‌బ‌ట్టారు. తద్వారా యావత్ సింగరేణిని మొత్తం ప్రవేట్ పరం చేసే కుట్ర చేస్తోంద‌న్నారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షులు డీకొండ అన్నయ్య, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి,పెట్టం లక్ష్మణ్, దొమ్మటి పోశెట్టి, ఏరియా నాయకులు జగదీశ్వర్ రెడ్డి, అడ్డుశ్రీను, లాగల శ్రీను, తిరుపతి రెడ్డి, అన్ని గనుల డిపార్ట్మెంట్ ఫిట్ కార్యదర్శిలు మహేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి,రాయమల్లు,తిరుపతి, వెంకన్న,గడ్డం మల్లయ్య, రత్నాకర్ రెడ్డి, పెంట శ్రీను, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, చారి, ఓరం జగన్, మైన్స్ & సేఫ్టీ కమిటీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like