సింగరేణి వీఆర్ఎస్ కుటుంబాల‌ను ఆదుకోండి

-ఆ హామీని కేసీఆర్ మరిచిపోయారు
-ఎన్నిసార్లు చెప్పినా ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకోలేదు
-కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను క‌లిసిన వివేక్ వెంక‌ట‌స్వామి

సింగ‌రేణిలో అధికారుల ఒత్తిడితో VRS తీసుకున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ స‌భ్య‌డుఉ, మాజీ ఎంపీ వివేక్ కోరారు. సింగరేణి VRS బాధితుల సమస్యలపై బుధవారం ఆయన ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ… తమ వారసుకులకు ఉద్యోగం ఇస్తామని సింగరేణి అధికారులు హామీ ఇవ్వడంతో 1997-2001 మధ్య కాలంలో 1795 మంది కార్మికులు వీఆర్ఎస్ తీసుకున్నారని అన్నారు. గతంలో వీఆర్ఎస్ తీసుకున్న ఉద్యోగుల వారసులకు ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని వివేక్ తెలిపారు. ఇందుకు సంబంధించి 1998లో కార్మిక సంఘాల‌తో యాజమాన్యం ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుందని తెలిపారు. నెలకు 30 మంది చొప్పున రెండేళ్ల లో బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని తెలిపిందన్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు.

ముఖ్య‌మంత్రి ప‌ట్టించుకోలే..
VRS బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్… ఇప్పుడు ఆ హామీని మరిచారన్నారని వివేక్ వెంక‌ట‌స్వామి దుయ్య‌బ‌ట్టారు. ఎన్నో సార్లు సీఎం కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లానని, కానీ ఆయన పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి కొత్త ఉద్యోగులను తీసుకుంటున్న నేపథ్యంలో వీఆర్ఎస్ తీసుకున్న కుటుంబాలకు న్యాయం చేయాలని మంత్రిని కోరినట్లు వివేక్ చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ హామీ ఇచ్చారని ఆయన అన్నారు. వివేక్‌తో పాటు బీఎంఎస్ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు చింత‌ల సూర్య‌నారాయ‌ణ‌, వీఆర్ఎస్ డిపెండెంట్ బాధితులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like