సింగరేణి కార్మికులకు రూ. 700 కోట్ల లాభాల వాటా

-సింగ‌రేణి సంస్థ మ‌న సొంత ఆస్తి
-కాంగ్రెస్ స‌గం ముంచితే, బీజేపీ పూర్తిగా ముంచుతోంది

Singareni: సింగ‌రేణి కార్మికుల‌కు ఈ ఏడాది లాభాల వాటా కింద రూ. 700 కోట్లు పంపిణీ చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఆయ‌న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడారు. సింగ‌రేణికి ఈ ఏడాది రూ. 2,184 కోట్ల లాభాలు వ‌చ్చాయ‌ని అందులో రూ. 700 కోట్లు లాభాల వాటా కింద ద‌స‌రాకు పంపిణీ చేస్తామ‌న్నారు. గ‌తంలో రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్లు మాత్ర‌మే వాటా కింద వ‌చ్చేవ‌న్నారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారింద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. 134 ఏళ్ల సింగరేణి మ‌న‌ సొంత ఆస్తి అని తెలంగాణ కేసీఆర్‌ (CM KCR) స్ప‌ష్టం చేశారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని అప్పులపాలు చేసిందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అప్పులు చెల్లించలేక 49 శాతం వాటాను కేంద్రానికి అమ్మిందన్నారు. తెలంగాణ వచ్చాక సింగరేణి రూపురేఖలు మారాయన్నారు. విద్యుత్, సాగునీటి రంగాల్లో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉందని, సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం చూస్తోందని కేసీఆర్‌ మండిపడ్డారు.

దేశంలో బొగ్గుకు కొర‌త లేదు. ఇక్క‌డ 361 బిలియ‌న్ ట‌న్నుల నిల్వలు ఉన్నా ఆస్ట్రేలియా, ఇండోనేషియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ పూర్తిగా ముంచిందని విమర్శించారు. సింగరేణి విస్తరణకు రాష్ట ప్రభుత్వం కృషిచేస్తోందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణలాగా విద్యుత్ సరఫరా మరే రాష్ట్రంలో లేదని, దేశ రాజధాని ఢిల్లీలోనే విపరీతమైన కరెంట్ కోతలు ఉన్నాయని కేసీఆర్‌ చెప్పారు. విద్యుత్ కోత‌లు, లోవోల్టేజీ లేకుండా 24 గంట‌లు క‌రంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు.

అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నామని.. తెలంగాణ వచ్చాక సింగరేణి నడక మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ టర్నోవర్‌ను రూ. 33 వేల కోట్లకు పెంచామని సీఎం వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని.. అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలో బొగ్గుకు కొరత లేదని.. 360 బిలియన్ టన్నుల బొగ్గు వుండగా విద్యుత్ రంగాన్ని ప్రైవేట్‌పరం చేస్తామని అంటున్నారని సీఎం దుయ్యబట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like