వందే భారత్ రైళ్లలో స్లీపర్ బెర్తులు..

Vande Bharat train: రైళ్ల‌లో ప్ర‌స్తుతం వందేభార‌త్‌కు ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు.. కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన ఈ రైళ్ల ప‌ట్ల ప్ర‌యాణీలు ఎంతో మ‌క్కువ చూపుతున్నారు. దీంతో ఈ వందేభార‌త్‌లో ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని కొత్త సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని రైల్వే శాఖ భావిస్తోంది.

వందే భారత్ రైళ్లలో ప్ర‌యాణించేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్వే అధికారులు మార్పులు తీసుకొస్తున్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపింగ్ బెర్తులు కూడా కల్పించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ‌వ్యాప్తంగా న‌డుస్తున్న ఈ రైళ్ల‌లో ప్ర‌స్తుతం స్లీప‌ర్ కోచ్‌లు లేవు. కానీ వాటిని ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్ఏనారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ వెర్షన్ రైలు గంటకు 220 కిమీ వేగంతో నడిచేందుకు రూపుదిద్దుకుంటోంది. స్లీపర్ వేరియంట్ రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా పని చేయనుంది.

మ‌రోవైపు మినీ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా తీసుకువ‌చ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రైళ్లు తక్కువ రద్దీ ఉండే ప్రాంతాల్లో తిప్పనున్నారు. వందేభారత్ మెట్రో కూడా తీసుకురావాలని చూస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో తెలిపారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లు 500-600 కిలో మీటర్ల మధ్య ప్రయాణిస్తున్నాయి. అయితే మెట్రో వందే భారత్ రైళ్లు రెండు నగరాల మధ్య 100 కిలో మీటర్ల మధ్య కొనసాగుతాయని వైష్ణవ్ పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like