సోనియా దేశం కోసం త్యాగం చేసింది

ఆమెపై విచార‌ణ శోచ‌నీయం

సోనియా గాంధీ దేశం త్యాగం చేశార‌ని, అలాంటి వ్య‌క్తిపై ఈడీ పేరిట విచార‌ణ జ‌ర‌ప‌డం శోచ‌నీయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధిని విచారణ పేరుతో ఈ.డీ.వేధించడాన్ని నిరసిస్తూ మంచిర్యాల‌లో నిర‌స‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు వ‌క్త‌లు మాట్లాడుతూ సోనియాగాంధీపై కేంద్ర ప్రభుత్వం ఈడీ రూపంలో వేధించడాన్ని తప్పు పట్టారు. సోనియాగాంధీకి అండగా మోడీకి వినిపించేలా కార్యకర్తలు నినదించాలని పిలుపునిచ్చారు. నల్ల జెండాలు, నల్ల బ్యాడ్జీలతో కేంద్ర ప్రభుత్వానికి వ్య‌తిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి చౌరస్తాలో నాలుగు వైపులా ర‌హ‌దారి దిగ్భందించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దాదాపు గంటకు పైగా వాహనాలు నిలిచిపోవ‌డంతో జనం ఇబ్బందులు ప‌డ్డారు.

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కార్యక్రమానికి అధ్యక్షత వహించ‌గా, పీసీసీ పర్యవేక్షకుడు నిరంజన్ రెడ్డి, ఏఐసీసీ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ మంత్రులు బోడ జనార్దన్, వినోద్, మాజీ ఎమ్మెల్యే లు నల్లాల ఓదెలు, సంజీవరావు, శ్రీదేవి, ఐ.ఎన్.టీ.యూ.సీ నాయకుడు జనక్ ప్రసాద్, చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జి రఘునాథ్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నూకల రమేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like