శ‌బ‌రిమ‌లైలో వారికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు

Sabarimala : శబరిమలైలో అయ్య‌ప్ప భ‌క్తుల ర‌ద్దీ విప‌రీతంగా పెరిగిపోతోంది. భ‌క్తుల కోసం ట్రావెన్‌కోర్ దేవస్థానం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులు పోటెత్తుతుండటంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఒక కొత్త నిర్ణయం తీసుకుంది.

శబరిమలకు వచ్చే భక్తుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే శబరిమలలో తీవ్ర రద్దీ ఏర్పడి కొందరు భక్తులు అయ్యప్పను దర్శించుకోకుండానే దూరం నుంచి అయ్యప్ప కొండకు మొక్కి వెనుదిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న‌పిల్ల‌ల ద‌ర్శనానికి ప్రత్యేక గేటు నుంచి పంపించాల‌ని బోర్డు తీర్మానం చేసింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే చిన్నారులు ఇక నుంచి సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఆదివారం నుంచి ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇరుముడులు కట్టుకున్న అయ్యప్ప భక్తులు, సాధారణ జనంతో సాధారణ లైన్లు కిక్కిరిసిపోతుండటంతో చిన్న పిల్లలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక బాలిక స్పృహ తప్పి పడిపోగా.. ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుని చిన్నారులకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనాలు కల్పిస్తున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నిర్ణయంతో చిన్న పిల్లలకు పొడవైన క్యూలైన్ల బాధ త‌ప్ప‌నుంది. దీని వల్ల చిన్నారులు స్వామి వారిని దర్శించుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రులకు కూడా ఉపశమనం కలుగ‌నుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like