నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా..

-రామగుండం పోలీస్ కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఏర్పాటు
-అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్ష
-సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్ట్ ల ఏర్పాటు

Fake seeds: న‌కిలీ విత్త‌నాల‌పై పోలీసు శాఖ ప్ర‌త్యేక నిఘా పెట్టింది. న‌కిలీ విత్త‌నాల విక్ర‌యాలు, ర‌వాణాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశాల నేప‌థ్యంలో పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వానాకాలం ద‌గ్గ‌ర ప‌డుతుంటంతో రైతులు సాగుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. దీంతో ఇటు న‌కిలీ విత్త‌న విక్ర‌య‌దారులు సైతం వాటిని అమ్మేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు వాటిని అరిక‌ట్టేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు చేప‌ట్టారు. వ్యవసాయశాఖ, ఇంటెలిజెన్స్ సిబ్బందితో కలిసి రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రైతులను మోసం చేసి నకిలీ విత్తనాలను సరఫరా చేసే వారిని గుర్తించి, అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు పూర్తి స్థాయిలో స‌న్న‌ద్ధ‌మ‌య్యారు.

రామగుండం కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలోని విత్తన, ఎరువుల దుకాణాలను, గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. అనుమానం వచ్చిన విత్తనాల శాంపిల్స్ వెంటనే పరీక్షలకు పంపిస్తారు. రవాణా వాహనాలను కూడా ఆకస్మిక తనిఖీలు చేస్తారు. లైసెన్స్ లు లేకుండా వ్యాపారం చేసే వారిపై నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. మ‌రోవైపు, ప్రభుత్వ అనుమతి పొందిన సంస్థల నుంచి విత్తనాలను వినియోగించేలా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రైతులకు అవగాహన కల్పించేందుకు పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఇక నకిలీ విత్తనాలు ఇతర రాష్ట్రాల నుంచి రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టుల‌తో నిఘా ఏర్పాటు చేశారు. అన్నిర‌కాలుగా న‌కిలీ విత్త‌నాలు అరిక‌ట్టేందుకు పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో అక్రమంగా తరలిస్తున్న మద్యంను అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖ, రైల్వే, రవాణా శాఖ సమన్వయంతో జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ రవాణాను జరిగే ప్రాంతాలు, మార్గాలను గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, మొబైల్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు మద్యం అక్రమ రవాణాను నిరోధించేందుకు ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేశారు..

2021, 2022, 2023 సంవత్సరం ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో…

👉 2021 సంవత్సరంలో 158 మందిపై 65 కేసులు, సీజ్ చేసిన నకిలీ విత్తనాలు 5,083 కిలోలు వాటి విలువ రూ. 95,92,141

👉 2022 సంవత్సరంలో 27 మందిపై 13 కేసులు, సీజ్ చేసిన నకిలీ విత్తనాలు 1,483 కిలోలు వాటి విలువ రూ. 27,97,000

👉 2023 సంవత్సరంలో 9 మందిపై 2 కేసులు, సీజ్ చేసిన నకిలీ విత్తనాలు 1,310 కిలోలు వాటి విలువ రూ. 26,20,000

👉 ఇప్పటివరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాల రవాణా, వ్యాపారం చేసే 18 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like