శ్రీవారి దర్శనానికి రెండు రోజులు

శ్రీ‌వారి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ద‌ర్శ‌నారికి రెండు రోజుల స‌మ‌యం ప‌డుతోంది. దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులుతీరారు.

తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వేసవిసెలవులు, వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్‎మెంట్లు నిండి ఆస్థాన మండపం వరకు క్యూలైన్ పెరిగింది. సుమారుగా 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. వైకుంఠఏకాదశి, గరుడసేవ లాంటి పర్వదినాల కంటే ఎక్కువ మంది భక్తులు వ‌స్తున్నార‌ని టీటీడీ అధికారులు చెబుతున్నారు.

ఆలయంలో గంటకు 4,500 మంది భక్తులకు మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. కానీ గంట‌కు 8 వేల మంది భ‌క్తులు వ‌స్తున్నారు. అందుకే శ్రీవారి దర్శనం చేయించేందుకు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇలాంటి అనూహ్యమైన రద్దీ సమయంలో వీఐపీలు తిరుమల యాత్ర విషయంలో పునరాలోచించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

మరోవైపు తిరుమల శ్రీవారిని శనివారం 89,318 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం ఒక్క రోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like