శ్రీవారి లడ్డూకి 308 ఏళ్లు

Thirumala: వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదమంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం. ఎవ‌రైనా శ్రీ‌వారి ద‌ర్శ‌నం వెళ్లారంటే మొక్కులు చెల్లించుకున్న త‌ర్వాత ఖ‌చ్చితంగా తీసుకునేంది శ్రీ‌వారి ల‌డ్డూనే. తిరుమ‌ల వెళ్లి వ‌చ్చిన వారిని ల‌డ్డూ తేలేదా..? అని అడుగుతారు.. ఆ దేవ‌దేవుడికి ఇష్ట‌మైన ప్ర‌సాదం ల‌డ్డూకి వంద‌ల ఏండ్ల చ‌రిత్ర ఉంది. తిరుప‌తి పోటులో ల‌డ్డూ త‌యారీ ప్రారంభించి 308 ఏళ్లు పూర్తి చేసుకుంది. దాని చ‌రిత్ర ఏంటో తెలుసుకుందామా..?

తిరుమలకు వచ్చే యాత్రికులు.. ఆ శ్రీనివాసుడి ముగ్ధమనోహర రూపాన్ని చూసి ఎంత ఆనందిస్తారో.. శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుకొండల వాడి భక్తుల మనసులో ప్రత్యేక స్థానం ఉంది. ఏడుకొండలు ఎక్కి వెంకన్నను దర్శించుకున్నంత పుణ్యం.. తిరుపతి లడ్డూను తింటే వస్తుందనే నమ్మకం ప్రజల్లో ఎక్కువ. తిరుమలకు వచ్చిన భక్తులు స్వామి వారి దర్శనం అనంతరం, స్వామి వారి ప్రసాదమైన లడ్డూనూ తమతో పాటూ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తి శ్రద్దలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతూ ఉంటారు.

అంతటి విశిష్టత ఉన్న తిరుపతి లడ్డూ.. మూడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆలయ పోటులో ప్రత్యేకంగా తయారయ్యే ఈ లడ్డూలను స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించి ఇప్పటికి 308 ఏళ్లు పూర్తయ్యాయి. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయడం ప్రారంభించారు. కాలానుగుణంగా పెరుగుతున్న భక్తుల రద్దీ నేపధ్యంలో రోజూ దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది.

తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. 2014లో తిరుపతి లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ గుర్తింపు కూడా లభించింది. ఆ విధంగా తరాలు మారుతున్నా తరగని రుచితో.. హిందువుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది తిరుపతి లడ్డూ. అంతేకాదు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పొంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు, ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like