కార్యాల‌యం ప్రారంభించి… అధ్య‌క్షున్ని కూర్చోబెట్టి

BRS: ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుక్ర‌వారం మంచిర్యాల పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జిల్లా అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్‌ను లాంఛ‌నంగా కూర్చోబెట్టారు. అంత‌కుముందు ముఖ్య‌మంత్రి కేసీఆర్ జిల్లాకు వ‌చ్చిన సంద‌ర్భంగా సుమ‌న్ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు పుష్ఫ‌గుచ్ఛం అంద‌చేసి స్వాగ‌తం ప‌లికారు. మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్ కి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. పండితుల వేద మంత్రోచ్ఛారణలు, పూర్ణకుంభ స్వాగతం నడుమ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించి, నూతన కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మంత్రులు, ప్రజాప్రతినిధులతో వెంట రాగా కేసీఆర్ రిబ్బన్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో సీఎం పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ ను కుర్చీలో కూర్చోబెట్టి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ సీఎం ఆశీర్వాదం తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like