సీపీఎస్ ర‌ద్దు చేసే వ‌ర‌కు ఆందోళ‌న

Struggle for abolition of CPS: సీపీఎస్ ర‌ద్దు చేసే వ‌రకు పీఆర్‌టీయూ (PRTU TS) ఆందోళ‌న నిర్వ‌హిస్తుంద‌ని ఆ యూనియ‌న్ అధ్య‌క్షుడు ఆవునూరి తిరుప‌తి స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర పిలుపు మేర‌కు భీమిని మండ‌ల తహసీల్దార్ పరమేశ్వర రెడ్డికి విన‌తిప‌త్రం అందించారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తి మాట్లాడుతూ 01.09.2004న ప్రవేశపెట్టిన CPS విధానం వ‌ల్ల ఉద్యోగ, ఉపాధ్యాయలకు తీవ్ర నష్టం కలుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విధానం వ‌ల్ల గ్రాట్యూటీ, సర్వీస్ పెన్షన్ కోల్పోతున్నామ‌ని అన్నారు. అకాల మరణం సంభవిస్తే దీని వ‌ల్ల కుటుంబం, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోంద‌న్నారు. మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ అనంతరం వృద్ధాప్యంలో పెన్షన్ సౌకర్యం లేకపోతే కుటుంబానికి చాలా ఇబ్బందిగా ఉంటున్నాదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సైదం వెంకటేష్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like