స‌ర్పంచ్ భిక్షాట‌న

ఓ స‌ర్పంచ్ అర్ధ‌నగ్నంగా ఇళ్లిళ్లూ తిరుగుతూ భిక్షాట‌న చేశారు. త‌న నిర‌స‌న ప్ర‌భుత్వానికి వినూత్నంగా త‌న నిర‌స‌న ఇలా తెలిపారు. వివ‌రాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ సర్పంచ్ మిరియాల వెంకన్న గ్రామంలో అర్ధనగ్నంగా ఇళ్లిళ్లూ తిరుగుతూ భిక్షాటన చేశారు. గ్రామంలో చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుల చేయటం లేదంటూ నిరసన తెలిపారు. కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఉందని, ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నాడు సర్పంచ్ మిరియాల వెంకన్న. దీంతో చేసేదేమీ లేక పంచాయతీ కార్మికులతో కలిసి డప్పు చప్పుళ్లతో ఊళ్లోని షాపుల దగ్గర తిరుగుతూ భిక్షాటన చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు వెంకన్న.

Get real time updates directly on you device, subscribe now.

You might also like