స్వామి వివేకుడి జీవితం ఆద‌ర్శ‌వంతం

నేటి యువతకు స్వామి వివేకానంద జీవితం ఎంతో ఆద‌ర్శవంత‌మ‌ని మేడ్చల్ రూరల్ జిల్లా బిజెపి కార్యదర్శి, మహిళా శక్తి మై వాయిస్ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హైమారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూముకుంట మున్సిపాలిటీ సింగాయపల్లి-హకింపేట్ లో పివి రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జ‌యంతి వేడుక‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యంత పిన్న వయసులో ప్రపంచానికి భారత భూమి ఔనత్యాన్ని తెలిపిన మహనీయుడు వివేకానందుడు అని అన్నారు. భారతీయతను ఖండాంతరాలకు చాటిన స్వామి వివేకానంద నిత్య‌స్మ‌ర‌ణీయుడ‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like