తాడోపేడో తేల్చుకుంటాం

మంచిర్యాల : కేంద్ర వైఖ‌రిపై తాడోపేడో తేల్చుకుంటామ‌ని సింగ‌రేణి కార్మికులు తేల్చి చెప్పారు. మంద‌మ‌ర్రి వ్యాప్తంగా సింగ‌రేణిపై కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌సన‌గా గురువారం గ‌నులు, డిపార్ట్‌మెంట్లు, ఓపెన్‌కాస్టుల‌పై సంత‌కాల సేక‌ర‌ణ చేశారు. ఈ సంద‌ర్భంగా కే.కే.5 గని పై నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో టీబీజీకేఎస్ సీనియ‌ర్ నాయ‌కులు జే. ర‌వీంద‌ర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం తెలంగాణలోని 4 సింగరేణి బొగ్గు బ్లాక్ లను వేలం వెయ్యడం స‌రికాద‌న్నారు. ఎట్ట ప‌రిస్థితుల్లో అడ్డుకుని తీరుతామ‌న్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ పిట్ సెక్రటరీ జీడి బాపు, మిట్ట సూర్యనారాయణ, వీరా రెడ్డి, సారయ్య, మోహన్ రెడ్డి, రాంచందర్, బొడ్డు మల్లేష్, పెండెo క్రిష్ణ సాయి, రాజేందర్ పాల్గొన్నారు. కేకే 1 గ‌నిపై నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పెండ్రి రాజిరెడ్డి, పిట్ సెక్రటరీ మాధవరెడ్డి ,ఈశ్వర్,ద‌బ్బెట‌ శ్రీనివాస్, పోలు సంపత్, తిరుమలిరెడ్డి, సంతోష్ పాండే, మ‌హేంద‌ర్‌, వెంక‌టేష్‌, పాల్గొన్నారు..

Get real time updates directly on you device, subscribe now.

You might also like