టీబీజీకేఎస్ చొర‌వ‌తోనే హ‌క్కుల సాధ‌న‌

-కోల్ ఇండియాలో లేనివి కూడా ఇక్కడ అమ‌లు అవుతున్నాయి
-జాతీయ సంఘాల మాట‌లు న‌మ్మే ప‌రిస్థితులు లేవు
-బ‌దిలీ వ‌ర్క‌ర్ల‌కు తొమ్మిదో నెల‌లోపు ప్ర‌మోష‌న్లు
-టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి

మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం చొర‌వ‌తోనే కార్మికుల హ‌క్కుల సాధ‌న జరిగింద‌ని టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఎస్ఆర్‌పీ 3 గ‌నిలో TBGKS ఆధ్వర్యంలో గేట్‌ మీటింగ్ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచిన తర్వాత కార్మికులకు ఎన్నో హక్కులు సాధించామ‌ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకా ఏమైనా చిన్నచిన్న సమస్యలు ఉంటే యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్యక్షతన, కోల్‌బెల్ట్ ప్ర‌జాప్ర‌తినిధుల స‌హ‌కారంతో కార్మిక సమస్యలను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు.

కొన్ని జాతీయ సంఘాలు కావాలని కార్మికులకు ప‌నిగ‌ట్టుకుని అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు. చైత‌న్య‌వంత‌మైన కార్మికులు వారిని గ‌మ‌నిస్తున్నారని అన్నారు. జాతీయ సంఘాలు చెప్పే మాటలను ఎవరు నమ్మవ‌ద్ద‌ని ఆయ‌న కోరారు. కార్మికుల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఆదరించాలని, త‌మ వైపే ఉండాలని కోరారు. బదిలీ వర్కర్లకు 190&240 మస్టర్లు నిండిన వారికి ఈ సంవత్సరం తొమ్మిదో నెల లోపు జనరల్ మజ్దూర్ ప్రమోషన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు బ‌దిలీ వ‌ర్క‌ర్లు, సీనియ‌ర్ కార్మికులకు మిర్యాల రాజిరెడ్డి కండువా క‌ప్పి టీబీజీకేఎస్‌లోకి ఆహ్వానించారు.

శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కేతిరెడ్డి సురేందర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ గేట్ మీటింగ్‌లో ఫిట్ సెక్రెటరీ గోపాల్ రెడ్డి, కేంద్ర ఉపాధ్యక్షుడు ఢీకొండ అన్నయ్య,మంద మల్లారెడ్డి, కేంద్ర చర్చల ప్రతినిధి వీరభద్రయ్య, ఏరియా చర్చల ప్రతినిధులు వెంగల కుమారస్వామి, పెట్టం లక్ష్మణ్, ఏరియా సెక్రెటరీ పానుగంటి సత్తయ్య,జగదీశ్వర్ రెడ్డి,తోoగల రమేష్,లాగాల శ్రీనివాస్, చిలువేరు సదానందం,సతీష్,మహిపాల్ రెడ్డి,చేరాలు యాదవ్ మరియు పిట్ సెక్రటరీలు పుప్పాల సదానందం,ఏంబడి తిరుపతి,పెగ మల్లేష్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ భాస్కర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like