కార్మికుల‌కు ఇబ్బందులు లేకుండా చూడండి

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్‌రావు

సింగ‌రేణి కార్మికుల‌కు సంబంధించిన రికార్డుల్లో ప‌లు చోట్ల త‌ప్పులు ఉండ‌టం వ‌ల్ల కార్మికులు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని వీటిని స‌రిచేయాల‌ని తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్‌రావు డిమాండ్ చేశారు. సోమ‌వారం కార్మికుల రికార్డుల్లో త‌ప్పులు స‌రిదిద్దాల‌నే విష‌యంలో బెల్లంప‌ల్లి ఏరియా జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌కు టీబీజీకేఎస్ ఆధ్వ‌ర్యంలో విన‌తిప్ర‌తం స‌మ‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ చాలా మంది కార్మికులకు అవ‌గాహ‌న లేక రికార్డుల్లో త‌ప్పులు స‌రిదిద్దుకోలేద‌న్నారు. పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు సైతం సరైన అవగాహన కల్పించలేద‌ని తెలిపారు. పర్సనల్ రికార్డులలో ఉద్యోగి వారి కుటుంబ సభ్యుల వివ‌రాలు ర‌క‌ర‌కాలుగా ఉంటంతో కార్మికుడు పదవి విరమణ పొందిన‌, అన్ ఫిట్ అయిన స‌మ‌యాల్లో ఉద్యోగం ఇచ్చే స‌మ‌యంలో కానీ, డ‌బ్బులు ఇచ్చే స‌మ‌యంలో కానీ నెల‌ల త‌ర‌బ‌డి తిప్పించుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందుకే వెంటనే వారి పర్సనల్ రికార్డులలో తప్పులను సరిచేసి నమోదు చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ను కోరారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఎన్నో హ‌క్కులు సాధించిన‌ట్లు చెప్పారు. అయితే కార్మికుల రికార్డులు సరిగా లేకపోవడం వల్ల‌ ఉద్యోగం లేదా బెనిఫిట్స్ పొందడంలో కార్మికుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌న్నారు. అందుకే అధికారులు స్పందించి రికార్డులు సరిగా చేయడం కోసం కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చల ప్రతినిధి ధరావత్ మంగీలాల్ జి ఎం కమిటీ సభ్యులు కొగిలాల రవీందర్, అబ్బు శ్రీనివాస్ రెడ్డి, అలవేణి సంపత్ నాయ‌కులు ఉస్మాన్, ఓరం కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like