టీబీజీకేఎస్ నేత రాస‌లీల‌లు

-కార్మికుడి భార్య‌ను లొంగ‌దీసుకున్న టీబీజీకేఎస్ నేత‌
-భ‌ర్త‌కు అనుమానంతో సీసీ కెమెరాల ఏర్పాటు
-అందులో చిక్కిన నేత బాగోతం
-రూ. 10 ల‌క్ష‌లు ఇచ్చి మేనేజ్ చేసే ప్ర‌య‌త్నం
-విడాకులు కావాలంటూ ఆ యువ‌తి భ‌ర్త డిమాండ్
-విష‌యం తెలిసినా గ‌ప్‌చిప్‌గా ఉంటున్న పెద్ద‌లు

మంచిర్యాల : ఆయ‌న అధికార పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ నేత‌.. ఇంకేముంది. అధికారం, బ‌ల‌గం క‌లిసి విచ్చ‌ల‌విడి ప‌నుల‌కు తెగ‌బ‌డ్డాడు. త‌న వ‌ద్ద‌కు ప‌ని కోసం వ‌చ్చిన ఓ కార్మికుడి భార్య‌పై క‌న్నేశాడు. ఆమెను లోబ‌రుచుకున్నాడు. ఇప్పుడు ఆ కుటుంబం విచ్ఛినం అయ్యే ప‌రిస్థితి వ‌చ్చింది. భ‌ర్త విడాకులు కావాలంటూ క‌నిపించిన వారిన‌ల్లా వేడుకుంటున్నాడు.

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం.. మొన్న‌టి వ‌ర‌కు సింగ‌రేణిలో గుర్తింపు సంఘంగా కొన‌సాగింది. ఆ యూనియ‌న్‌కు గౌర‌వ అధ్య‌క్షురాలిగా క‌విత కొన‌సాగుతున్నారు. కానీ, ఆ యూనియ‌న్ నేత‌ల వ‌ల్ల మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంది. గ‌తంలో రామ‌గుండం ప్రాంతంలో మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌డం, వారు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేయ‌డం జ‌రిగింది. ఇక ఇప్పుడు మంద‌మ‌ర్రి ఏరియా వంతు వ‌చ్చింది. మంద‌మ‌ర్రి ఏరియాలో ఓ గ‌నిలో ప‌నిచేస్తున్న టీబీజీకేఎస్ నేత వ‌ద్ద‌కు కారుణ్య నియామ‌కం విష‌యంలో సింగ‌రేణి కార్మికుడు, ఆయ‌న కొడుకు వ‌చ్చారు. ఆ ప‌ని చేసి పెడ‌తాన‌ని హామీ ఇచ్చిన ఆ నేత‌ ఆ యువ‌కుడి భార్య‌పై క‌న్నేశాడు.

చివ‌ర‌కు ఆమెను లొంగ‌దీసుకున్నాడు. త‌న‌ను మంచిర్యాల ఇత‌ర ప్రాంతాల‌కు తిప్ప‌డం, అక్క‌డి నుంచి తీసుకురావ‌డం చేసేవాడు. మంచిర్యాల‌లో త‌న ఇంటి వ‌ద్ద‌కు కూడా ఆమెను ఎన్నోమార్లు తీసుకువెళ్లాడు. అనుమానం వ‌చ్చిన యువ‌కుడు ఇంటి వ‌ద్ద సీసీ కెమెరాలు పెట్టించాడు. దీంతో ఆ టీబీజీకేఎస్ నేత‌ బాగోతం ఆ కెమెరాలో చిక్కింది. దీంతో ఆ యువ‌కుడు టీబీజీకేఎస్ నేత‌ను నిల‌దీయ‌డంతో న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాడు. రూ. 10 ల‌క్ష‌లు ఇస్తాన‌ని, సైలెంట్ గా ఉండాల‌ని పెద్ద‌ల ద్వారా చెప్పించాడు. త‌న‌కు డ‌బ్బులు వ‌ద్ద‌ని భార్య నుంచి విడాకులు కావాల‌ని అత‌ను చెప్ప‌డంతో ఈ వివాదం బ‌య‌ట‌కు పొక్కకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు.

ఈ విష‌యం చాలా మంది పెద్ద‌ల‌కు తెలిసినా, ఇది బ‌య‌ట‌కు రాకుండా పోలీస్‌స్టేష‌న్ వెళ్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు త‌ప్ప‌.. ఆ టీబీజీకేఎస్ నేత‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. పైగా కాంప్ర‌మైజ్ కావాల‌ని ఆ యువ‌కుడిపైనే ఒత్తిడి తెస్తున్న‌ట్లు తెలుస్తోంది. లేక‌పోతే నీ ఉద్యోగం పోతుంద‌ని బాధితున్నే హెచ్చ‌రిస్తున్న‌ట్లు స‌మాచారం. ద‌ళిత సంఘాల దృష్టికి సైతం తీసుకుపోయిన‌ట్లు స‌మాచారం. ఈ విష‌యంలో ఆ యువ‌కుడు ఓ ప్ర‌తిప‌క్ష యూనియ‌న్ నేత వ‌ద్ద‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మ‌రి ఇప్ప‌టికైనా ఆ నేత‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా..? లేదా..? అన్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like