TBGKS వ‌చ్చాకే కార్మికుల ముఖాల్లో న‌వ్వులు

-అధికారం పోయి అబ‌ద్దాలు మాట్లాడుతున్నారు
-పెద్ద నేత‌ల పేర్లు చెప్పి ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు
-సింగ‌రేణి ప్రైవేటీక‌ర‌ణ మిన‌హా AITUC చేసింది ఏమీ లేదు
-ఆర్‌కే 6 గేట్ మీటింగ్‌లో టీబీజీకేఎస్ నేత‌లు వెల్ల‌డి

మంచిర్యాల : సింగ‌రేణిలో త‌మ యూనియ‌న్‌ వ‌చ్చాకే కార్మికుల ముఖాల్లో న‌వ్వులు క‌నిపిస్తున్నాయ‌ని ప‌లువురు TBGKS నేత‌లు స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఆర్‌కే6 గ‌నిలో నిర్వ‌హించిన గేట్ మీటింగ్ లో నేత‌లు పాల్గొని మాట్లాడారు. ఏఐటీయూసీ నేత‌లు కార్మికులకు కల్లబొల్లి మాటలు, అబద్ధాలు చెబుతూ కాలం వెల్ల‌దీస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పెద్ద నాయకుల పేర్లు చెప్పుకొని గతంలో వాళ్లు చేసింది చెప్పుకోవడం తప్ప చేసేదేమీ లేద‌న్నారు. ఏఐటీయూసీ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు ఏ ఒక్క హక్కయినా సాధించి కార్మికులు ఇచ్చారా…? అని ఈ సంద‌ర్భంగా ప్ర‌శ్నించారు.

కేవ‌లం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని విమర్శించడం తప్ప వారికి వేరే పని దొరకడం లేదని దుయ్య‌బ‌ట్టారు. AITUC మూడుసార్లు గెలిచింద‌ని అప్పటినుంచి సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలతో సహా ఎన్నో హక్కులను పోగొట్టింద‌ని స్ప‌ష్టం చేశారు. వారు అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో ప్రైవేటీకరణ ప్రవేశపెట్టార‌ని, ఇప్పుడు అది అంచెలంచెలుగా పెరిగింద‌న్నారు. చేసింది వారు ఎదుటి వారిపై బుర‌ద చ‌ల్ల‌డం వారికి అల‌వాటే అన్నారు.

కోల్ ఇండియాలో లేని ఎన్నో హక్కులను తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సింగరేణి కార్మికులకు అందిస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ముఖ్య‌మంత్రికి సింగ‌రేణి అంటే ఎన‌లేని ప్రేమ అన్నారు. అందుకే కార్మికుల‌కు వారసత్వ ఉద్యోగాలతో పాటు ఎన్నో హక్కులు కార్మికులకు కల్పిస్తున్నారని వెల్ల‌డించారు. ఇవి చూసి ఓర్వలేక AITUC నేత‌లు పిచ్చి ప్రేలాప‌న‌లు చేస్తోంద‌న్నారు. వారికి అధికారం పోయి 10 సంవత్సరాల అవుతోంద‌ని, ఏమి చేయాలో తోచక అధికారం కోసం అడ్డ‌దారులు తొక్కుతున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

ఎవరి హయాంలో వారసత్వ ఉద్యోగాలు పోయాయో యువతకు మొత్తం తెలుసన్నారు. ఈరోజు యువతకు సింగరేణి ఉద్యోగాలు వస్తున్నాయంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కవిత, నాయకులు వెంకట్రావు,రాజిరెడ్డి, మల్లయ్యనువిమర్శిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, దీనికి కార్మిక లోకమే బుద్ధి చెబుతుంద‌న్నారు.

శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వ‌హించిన గేట్ మీటింగ్లో కేంద్ర ఉపాధ్యక్షుడు ఢీకొoడ అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి చాట్ల అశోక్, ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్ష్మణ్,వెంగల కుమారస్వామి, దొమ్మేటి పోశెట్టి,ఏరియా సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, తొoగల రమేష్,అడ్డు శ్రీనివాస్, మైన్ ఫిట్ సెక్రెటరీ చిలుముల రాయమల్లు,అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఇప్ప భూమయ్య,పొగాకు రమేష్, అన్వేష్ రెడ్డి,వెంకట రాజం,లక్ష్మీనారాయణ, సమ్మయ్య,మాధవ రెడ్డి,అవదేశ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like