టెక్నీషియ‌న్ల‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించండి

హెచ్ఎంఎస్ ఆధ్వ‌ర్యంలో జీఎంకు విన‌తిప‌త్రం

సింగ‌రేణిలో ప‌నిచేస్తున్న టెక్నీషియ‌న్ల‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హించాల‌ని బెల్లంప‌ల్లి ఏరియా జీఎం సంజీవ‌రెడ్డికి కార్మికులు విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు. బెల్లంప‌ల్లి ఏరియాలో ఈపీ ఎలక్ట్రిషియ‌న్లు ఫిట్ట‌ర్లు గా 2017 సంవత్సరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి కౌన్సిలింగ్ ద్వారా బెల్లంపల్లి ఏరియాలో యాజమాన్యం పోస్టింగ్ ఇచ్చింది. వీరంతా అన్ని ఏరియాల్లో మూడేంళ్లుగా క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ టెక్నీషియ‌న్లు డ్యూటీ నిర్వ‌హించారు. ఈ జూనియర్స్ ఈపీ ఎలక్ట్రిషియ‌న్‌, ఫిట్టర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. సింగ‌రేణి యాజమాన్యం ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వీరికి కౌన్సెలింగ్ ద్వారా వారికి అనుకూలంగా వుండే ఏరియాకు వెళ్లే అవకాశం క‌ల్పించేది. దీంతో వారికి న్యాయం జ‌రిగేది. కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌క‌పోవ‌డంతో సింగ‌రేణిలో అవినీతి జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని కార్మికులు వాపోతున్నారు. సీనియ‌ర్ల‌కు, జూనియ‌ర్ల‌కు తేడా లేకుండా పోతోంద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ‌కు కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తార‌ని టెక్నీషియ‌న్లు ఆశ‌తో చూస్తున్నారు. ఇప్ప‌టికైనా కౌన్సిలింగ్ నిర్వహించి తగిన న్యాయం చేయాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేసింది. కౌన్సిలింగ్ పెట్టక పోతే అన్ని ఏరియాలలో జీఎం కార్యాల‌యాల ఎదుట ఆందోళ‌న చేస్తామ‌ని ఆ యూనియ‌న్ నేత‌లు హెచ్చ‌రించారు. కార్యక్రమంలో అబ్బాపూర్ , కైరిగూడ ఓపెన్‌కాస్టు టెక్నీషియ‌న్లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like