తెగిన గొల్లవాగు ప్రాజెక్టు కాలువ
![](https://naandinews.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-10-at-8.00.27-PM-1-750x430.jpeg)
మంచిర్యాల : భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఎల్కేశ్వరం శివారులో గొల్లవాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ తెగిపోయింది. ఈ కాలువ భీమారం నుండి చెన్నూరులోని పొలాలకు సాగునీరును అందిస్తుంది. ఎల్కేశ్వరం గ్రామ శివారులోని గొల్లవాగు ప్రాజెక్టు మెయిన్ కాలువ తెగిపోవడంతో పెద్దఎత్తున నీరు వృథాగా పోతోంది. కొంతకాలంగా అందులో తుంగ పెద్ద ఎత్తున పేరుకుపోయింది. దీంతో పాటు అధికారుల అలసత్వం కూడా తోడు కావడంతో కాలువ తెగిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.