బొగ్గు బావులను పోరుబావులుగా మారుస్తాం

-సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె ప్రభుత్వానికి పట్టదా..?
-ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్ ఆగ్ర‌హం

Telangana Govt, Singareni C&MD angry with contract workers: సింగరేణి కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం గానీ సింగరేణి ప్రాంతానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించక పోవటం దుర్మార్గమైన చర్య అని AITUC కేంద్ర కార్యదర్శి బోగే ఉపేందర్, IFTU రాష్ట్ర నాయకుడు బండారి తిరుపతి విమర్శించారు. 30 వేలు మంది 13 రోజులుగా స‌మ్మె చేస్తుంటే ప‌ట్టించుకోక‌పోవ‌డం దారుణ‌మ‌ని దుయ్య‌బ‌ట్టారు. బుధవారం కాంట్రాక్టు కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో భిక్షాటన చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ బొగ్గు బావులను పోరు బావులుగా మారుస్తామ‌ని హెచ్చరించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులు పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల‌ని అడిగితే రూపాయి కూడా వేతనం పెంచడం లేద‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, సింగ‌రేణి సీఅండ్ఎండీ నిమ్మకు నీరెత్తినట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారిన దుయ్య‌బ‌ట్టారు. వారు సింగరేణి సమ్మె పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు కాంట్రాక్టు కార్మికుల సమ్మెలో భాగస్వామ్యం కావాల‌ని వారు కోరారు. సమస్య పరిష్కారం కోసం ముఖ్య‌మంత్రిపై ఒత్తిడి తేవాల‌ని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. జీవో 22 అమలు చేయాల‌ని, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చెయ్యాల‌న్నారు. అన్ని లాభాల్లో కాంట్రాక్టు కార్మికుల‌కు వాటా ఇవ్వాల‌న్నారు. లేకపొతే రానున్న రోజుల్లో పర్మినెంట్ కార్మిక వర్గం కూడా సమ్మె లో భాగస్వామ్యం అవుతుంద‌ని హెచ్చ‌రించారు. రేపు జరిగే చర్చల్లో సమస్యలు పరిష్కరించాలని లేక‌పోతే స‌మ్మె ఉధృతం చేస్తామ‌ని హెచ్చరించారు. కార్య‌క్ర‌మంలో జేఏసీ నాయకులు చల్లూరి అశోక్, సాగర్ గౌడ్, శ్రీనివాస్, చిన్నుబాయ్, ఇప్ప చంద్రయ్య, కమల, ఈశ్వరి, శారద, కవిత, ఇంద్ర, సోమయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like