తెలంగాణ చేస్తోంది… దేశం అనుస‌రిస్తోంది..

-ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ పథ‌కాలు
-ఒక‌డు త‌వ్వుతా అంట‌డు.. ఒక‌డు కూల‌గొడ‌తా అంట‌డు
-సుమ‌న్ ఎమ్మెల్యేగా ఉండ‌టం ఈ ప్రాంత ప్ర‌జ‌ల అదృష్టం
-ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను డబుల్ మెజారిటీతో గెలిపించండి
-50 ఏండ్ల పాల‌న‌లో జ‌ర‌గ‌ని అభివృద్ది జ‌రుగుతోంది
-చెన్నూరు స‌భ‌లో మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు

Harish Rao: తెలంగాణలో ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లవుతున్నాయ‌ని రాష్ట్ర ఆర్థిక‌, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. చెన్నూరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 204 కోట్ల‌తో వివిధ అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసిన ఆయ‌న అనంత‌రం నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పనులు ఏ రాష్ట్రంలో జరగడం లేదని స్ప‌ష్టం చేశారు. ఎక్కడా లేనివిధంగా రైతుబంధు, దళిత బంధు పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయ‌న్నారు. నేటి కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శమ‌ని హ‌రీష్‌రావు వెల్ల‌డించారు. రైతుల కోసం రైతుబంధు రైతు బీమా లాంటి పథకాలే కాకుండా రైతులకు మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటున్నామ‌ని మంత్రి తెలిపారు.

కేసీఆర్‌ను ఆశీర్వ‌దించండి…
ఆరోగ్యలక్ష్మి, కళ్యాణలక్ష్మి, గృహలక్ష్మి లాంటి పథకాలన్నీ మహిళల పేరుపైనే అందిస్తున్నామ‌ని హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొడుతున్నాయ‌న్నారు. తెలంగాణ జాతి గర్వపడేలా కేసీఆర్ పరిపాలన కొనసాగుతోంద‌ని తెలిపారు. ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని వెల్ల‌డించారు. నాటి పాలకులకు.. నేటి పాలన దక్షతకు తేడా గమనించి తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న కేసిఆర్ ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని మంత్రి హ‌రీష్‌రావు ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌ను కోరారు.

ఒక‌డు త‌వ్వుతా అంట‌డు.. ఒక‌డు కూల‌గొడ‌తా అంట‌డు
ప్ర‌తిప‌క్ష‌నేత‌లు ప్ర‌జ‌ల సంక్షేమం గురించి ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు ఇవ్వాల్సింది పోయి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నార‌ని హ‌రీష్‌రావు ఎద్దేవా చేశారు. ఒక‌రు ప్రగతి భవన్ కూలగొడతా అంటే ఇంకొక్కరు సమాధులు తవ్వుతా అంటున్నారని దుయ్య‌బ‌ట్టారు. మ‌న‌కు అలాంటి నాయకులు కావాలా..? అని ప్ర‌శ్నించారు. బీజేపీ వాళ్లు జ‌నాన్ని న‌మ్ముకోలేద‌న్నారు. వాళ్ళు ఐటీ, ఈడీ ,సిబిఐని నమ్ముకున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింద‌న్నారు.

సుమ‌న్ అభివృద్ది రుచిచూపిస్తున్న‌డు..
ఎదిగిన, మెదిగిన.. ముఖ్యమంత్రి ప్రేమానురాగాలు పొందిన బాల్క సుమ‌న్ ఎమ్మెల్యేగా రావ‌డం ఇక్క‌డి ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ని మంత్రి హ‌రీష్‌రావు స్ప‌ష్టం చేశారు. విపక్షాల 50 ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి నేడు చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతోంద‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. అభివృద్ధికి రోల్ మోడల్ గా చెన్నూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతున్నార‌ని చెప్పారు. చెన్నూరు దశ దిశ మారుస్తూ చెన్నూరుకి అభివృద్ధిని రుచి చూపిస్తున్న నాయకుడు బాల్క సుమన్ అని కొనియాడారు. ఉద్యమ స్ఫూర్తితో చెన్నూరు అభివృద్ధి చేస్తున్నారని స్ప‌ష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బాల్క సుమన్ ని డబుల్ మెజారిటీతో గెలిపించాలని మంత్రి ఈ సంద‌ర్భంగా కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like