తెలంగాణ నుండి తొలి మహిళా జడ్జి శ్రీదేవి..!

హైకోర్టు న్యాయమూర్తిగా జువ్వాడి శ్రీదేవి నియామకానికి సుప్రీం కొలీజియం సిఫారసు

నిర్మల్ జిల్లా కు చెందిన సీనియర్ న్యాయవాది జువ్వాడి శ్రీదేవి అలియాస్ కూచాడి శ్రీదేవి ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీం కోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రంకోర్టు సిఫారసు చేసిన 12 మందిలో శ్రీదేవి పేరు చోటు చేసుకుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తెలంగాణకు చెందిన మహిళకు ఈ అవకాశం దక్కడం ఇదే తొలిసారి. ప్రముఖ టీఆర్ఎస్ నేత శ్రీహరిరావు సతీమణి అయిన శ్రీదేవి రెండు దశాబ్దాలకు పైగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శ్రీదేవి నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తి కి చెందిన న్యాయవాది శ్రీహరి రావ్ ను వివాహం చేసుకున్నారు. సాధారణ గృహిణిగానే ఉంటూ న్యాయవాద వృత్తి పై ఆసక్తితో ఎల్ఎల్ బి చదివారు. భర్త శ్రీహరి సహకారంతో నిర్మల్ కోర్టు లో న్యాయవాదిగా వృత్తి ప్రారంభించిన ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. నిర్మల్ కోర్టులో అడిష‌న‌ల్ పీపీగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత హైకోర్టు జి పి అడిష‌న‌ల్ పీపీగా అవకాశాలు పొందారు. తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం ఆమెను తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తిగా నియమించేందుకు సిఫారసు చేసింది.

జువ్వాడి శ్రీదేవి బయో డేటా…

పేరు: జువ్వాడి శ్రీదేవి అలియాస్ కూచాడి శ్రీదేవి

తల్లిదండ్రులు: జువ్వాడి సూర్యారావు, భారతి

భర్త: శ్రీహరి రావ్ ( న్యాయవాది)

పిల్లలు: స్నేహ, మాధురి

పుట్టిన తేది: 10.08.1972

ప్రాక్టీసు: 1997 లో న్యాయవాదిగా ఎన్రోల్మెంట్

– 2004 నుండి 2008 దాకా నిర్మల్ అదనపు సెషన్స్ కోర్టు లో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పని చేశారు.

– 2014 నుండి 2017 దాకా రాష్ట్ర హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడరు గా బాధ్యతల నిర్వహణ

– 2018 జనవరి నుండి హైకోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కొనసాగుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like