తెరపై పునీత్ ని చూస్తూనే ఆగిన అభిమాని గుండె

ఒక అభిమాని తన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంజనగూడు గ్రామానికి చెందిన ఆకాష్(22) కి పునీత్ అంటే ఎనలేని అభిమానం. ఆయన నటించిన ప్రతిసినిమాను చూస్తూ పెరిగాడు. ఇటీవలే ఆయన మృతిని జీరించుకోలేకపోయాడు.. అయినా అభిమానాన్ని చంపుకోలేకపోయాడు. తన ఫెవరెట్ హీరో చివరి చిత్రాన్ని చూడాలని స్నేహితులతో కలిసి థియేటర్ కి వెళ్ళాడు. వెండితెరపై పునీత్ ని చూడగానే ఎమోష‌నల్ అయ్యాడు. తన అభిమాన హీరోను చూస్తూనే ఆకాష్ కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్నవారు ఏమైంది అని చూసేలోపులోనే అతడు మృతిచెందినట్లు అతడి స్నేహితులు తెలిపారు. ఆకాష్ కి గుండెపోటు రావడంతోనే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. అభిమాన హీరో మృతిని జీర్ణించుకోలేక అభిమాని గుండె ఆగడం ఎంతో విచారకరం అని, అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ నిజంగా గొప్పవాడని కన్నడ అభిమానులు కంటతడి పెడుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like