మ‌ద్ద‌తు ధ‌ర పెంచిన కేంద్రం

Central Cabinet: ఖరీఫ్ సీజన్లో పండిన పంటలకు మద్ధతు ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2023-24 ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపున‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో వరికి కనీస మద్దతు ధర 7 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వరికి క్వింటాకు మద్ధతు ధర రూ.2,183 పెంచగా అదే ఏ గ్రేడ్ వరికి క్వింటాకు రూ.2,203కు పెంచింది. పెసర్లపై 10.4 శాతం మద్దతు ధర పెంచింది. దీంతో పెసర్లు క్వింటాకు రూ.8,558కి పెరిగింది. పంటలకు మద్దతు ధర పెంపుపై కేంద్ర‌మంత్రి పీయుష్ గోయల్‌ మాట్లాడుతు పంటలకు మద్దతు ధర పెంపు రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడం, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని అన్నారు.

క్వింటాకు ధరలు ఇలా..
పెసర్లు రూ.8,558
కందులు రూ.7,000
రాగులు రూ.3.846
మినుములు రూ.6,950
సోయాబీన్ రూ. 4600
మీడియం సైజు పత్తి రూ. 6620
పొడుగు పత్తి రూ. 7020
నువ్వులు రూ. 8365

Get real time updates directly on you device, subscribe now.

You might also like