చెరువు క‌ట్ట కుంగి… గోతిలో ప‌డ్డ ద్విచ‌క్ర‌వాహ‌నం

The dam of the pond collapsed… the two-wheeler lying in the pit: చెరువు కట్ట కుంగి అకస్మాత్తుగా గొయ్యి ఏర్పడగా.. అందులో ఓ ద్విచక్ర వాహనంతో ఇద్ద‌రు వ్య‌క్తులు ప‌డిపోయారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం చెరువు కట్టపై చోటుచేసుకుంది. ఆకారం చెరువు తూముకు బుంగ ఏర్పడి నీళ్లు బయటకు వెళ్లిపోతుండటంతో పరిశీలించేందుకు సర్పంచి నాగభూషణం, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ స్వామి, పంచాయతీ కార్మికుడు నర్సింలు వేర్వేరు వాహనాలపై బయలుదేరారు. ముందు వాహనంపై సర్పంచి, వెనుక మరో బైక్‌పై మిగతా ఇద్దరు సిబ్బంది ప్రయాణిస్తున్నారు. చెరువు కట్టపై ఓ ప్రాంతంలో సర్పంచి వాహనం దాటగానే అకస్మాత్తుగా మట్టి కూలిపోయి పెద్ద గొయ్యి ఏర్పడింది. వెనక వాహనంపై వస్తున్నవారు అందులో పడిపోయారు. వారిని సర్పంచి బయటకు లాగారు. వారికి స్వల్ప గాయాలు కావడంతో పీహెచ్‌సీలో చికిత్స అందించారు. అనంతరం జేసీబీతో మట్టి పోసి గొయ్యిని పూడ్చేవారు. తూము వద్ద ఏర్పడిన బుంగను సైతం పూడ్చివేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like