సింగ‌రేణి కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లు నెర‌వేర్చాల్సిందే

The demands of Singareni contract workers must be fulfilled: సింగ‌రేణిలో కాంట్రాక్టు కార్మికుల‌ను డిమాండ్లు వెంట‌నే నెర‌వేర్చాల‌ని రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎండి అక్బర్ అలీ డిమాండ్ చేశారు. ఆర్కే 1A గనిపై కాంట్రాక్ట్ కార్మికులకు సమ్మెకు మద్దతుగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలన్నారు. విద్య, వైద్య, సంక్షేమం చట్టప్రకారం అమలు చేయాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెకు మద్దతుగా మంగ‌ళ‌వారం నల్ల బ్యాడ్జీలతో నిరసన , సాయంత్రం నాలుగు గంటలకి మందమర్రి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ‌హిస్తామ‌న్నారు. ఆ కార్య‌క్ర‌మాల‌ను విజయవంతం చేయాలని కార్మికుల‌ను కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, పిట్ సెక్రటరీ సురమళ్ళ వినయ్ కుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ గోవిందుల రమేష్, పిట్ వైస్ ప్రెసిడెంట్ గాజుల రాయమల్లు, సభ్యులు చంద్రకానీ రమేష్, మేడం బాల్ కోటి రెడ్డి, ఏలూరి శ్రీనివాస్, కాటేపెల్లి రాజశేఖర్, బొంకురి సురేష్, మేకల రమేష్ పాల్గొన్నారు..

Get real time updates directly on you device, subscribe now.

You might also like