బాలిక‌ల చ‌దువు పెంచేందుకు అంద‌రూ కృషి చేయాలి

-కోర‌మాండ‌ల్ కంపెనీ కృషి అభినంద‌నీయం
-వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి

Warangal: బాలికల చ‌దువు పెంచేందుకు ప్ర‌తీ ఒక్క‌రూ కృషి చేయాల‌ని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి అన్నారు. శుక్ర‌వారం అంబేద్కర్ భవన్లో కోరమాండ‌ల్ కంపెనీ నిర్వ‌హించిన గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ఒక విద్యార్థిని చ‌దువు ద్వారా ఆ కుటుంబం త‌ద్వారా ఈ దేశం మొత్తం బాగుప‌డుతుంద‌ని వెల్ల‌డించారు. ఆడ‌పిల్ల‌ల చ‌దువు పెంపొందించేందుకు కోర‌మాండల్ కంపెనీ చేస్తున్న కృషిని ఈ సంద‌ర్భంగా ఆమె కొనియాడారు. ఆడ‌పిల్ల‌ల‌కు స్కాల‌ర్‌షిప్‌లు అందించ‌డం ద్వారా వారిలో మ‌రింత మాన‌సిక స్థైర్యం పెంపొందుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

కంపెనీ సీనియర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కోరమాండల్ సంస్థ బాలిక‌ల చ‌దువు ప్రోత్స‌హించే దిశ‌గా ముందుకు సాగుతోంద‌న్నారు. ప్ర‌తి ఏటా తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి జిల్లా నుంచి వందమంది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చదువుతున్న బాలికల్లో ప్రతిభ ఆధారంగా స్కాల‌ర్‌షిప్‌లు ఇస్తున్నామ‌ని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉషా దయాళ్‌ మాట్లాడుతూ బాలికల చదువు దేశానికి ఎంతో ఉపయోగమ‌న్నారు. దీన్ని ప్రోత్సహిస్తున్న కోరమాండల్ కంపెనీకి అభినందనలు తెలిపారు.

కార్య‌క్ర‌మంలో కంపెనీ సీనియర్ జోనల్ మేనేజర్ సజన్ కుమార్, భరత్, సుదర్శన్ రెడ్డి, రాంప్రసాద్, సుమన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరేష్ శర్మ, అనిల్ రెడ్డి, రాహుల్, వాసు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Get real time updates directly on you device, subscribe now.

You might also like