రేవంత్‌ను కొనేటోడు ఇంకా పుట్ట‌లే…

“అమ్మ” మీద ఒట్టు
రాజీ నా రక్తంలో లేదు
భావోగ్వేద ప్ర‌సంగం చేసిన రేవంత్‌రెడ్డి

RevanthReddy: మునుగోడులో సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎలాంటి లాలూచీ పడలేదని, కేసీఆర్‌ సాయం గానీ.. బీఆర్ఎస్ పార్టీ సాయం గానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ (KCR) నుంచి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ముట్టాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో రేవంత్‌రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేశారు. మెడలో అమ్మవారి కండువా వేసుకుని.. కళ్ల నిండా కన్నీళ్లతో రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో నిఖార్సైన అభ్యర్థిని నిలబెట్టామని, బీఆర్ఎస్, బీజేపీ(BRS-BJP) వందల కోట్లు ఖర్చుపెట్టాయన్నారు. ఒకవేళ నేను చెప్పింది అబద్దమే అయితే మేము సర్వనాశనం అవుతాం. ఒకవేళ మీరు చేసిన ఆరోపణలు అబద్దమైతే మీరేమవుతారో అని రేవంత్ స్ప‌ష్టం చేశారు. నేను హిందువును. అమ్మవారిని నమ్ముతా.. నేను చెప్పింది అబద్దమైతే నేను సర్వనాశనం అవుతా అని అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా.” అంటూ రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.

ఈటల రాజేందర్(Etala Rajender) ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. ఆధారాలు చూపలేనని ఆయనే చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని కొనేటోడు ఇంకా పుట్టలేదని.. ఇక ముందు కూడా పుట్టడంటూ.. భావోద్వేగానికి గురైన రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను చేతకానితనంతో కన్నీళ్లు పెట్టుకోలేదని.. ఆవేదనతో వచ్చాయన్నారు రేవంత్.

చివరి రక్తపు బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతానని రేవంత్ ఉద్ఘాటించారు. కేసీఆర్ వ్యతిరేక గొంతులకు ఇచ్చే గౌరవం ఇదేనా రాజేంద్ర అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తన కూతురు పెళ్లి రోజునే తనను అరెస్ట్ చేశారని.. చర్లపల్లి జైలులో నిద్రలేని రాత్రులు గడిపాననని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అంటే ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. నోటీసులు రాగానే తాను లొంగిపోయే వాడిని కాదని ఈటలకు చురకలు అంటించారు. ఎవరు ఎవరిని గద్దె దించుతారో భవిష్యత్తులో తెలుస్తుందన్న రేవంత్ రెడ్డి… అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడకంటూ ఈటల రాజేందర్‌ను రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like