పోలీసుల నిర్ల‌క్ష్యం… నాకు ప్రాణ‌హాని

-తాళ్ల గురిజాల ఎస్ఐ ప‌ట్టించుకోవ‌డం లేదు
-తాగుడు బానిసై నా భ‌ర్త కొడుతున్నాడు
-హ‌త్యాయత్నం కూడా చేశాడు
-న్యాయం కోసం నిండు గ‌ర్భిణీ ఆవేద‌న

The pregnant woman complained that the police did not care: తాము ఫిర్యాదు చేసినా పోలీసులు క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, త‌న‌కు త‌గిన న్యాయం చేయాల‌ని ఓ నిండు గ‌ర్భిణీ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాళ్ల గురిజాల పోలీసుల నిర్ల‌క్ష్యంతో త‌న భ‌ర్త త‌నపై హ‌త్యాయ‌త్నం కూడా క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యింది. వివ‌రాల్లోకి వెళితే…

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఆకెనపల్లి గ్రామానికి చెందిన ఎగ్గె తిరుపతితో 10 సంవత్సరాల కింద‌ట సరిగ రవీణకు అనే మ‌హిళ‌తో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె 9 నెలల గర్భవతి. అయితే ర‌వీణ భ‌ర్త తిరుప‌తి తాగుడుకు బానిస‌య్యాడు. అద‌న‌పు క‌ట్నం కోసం మూడు నెల‌ల నుంచి వేధిస్తున్నాడు. అద‌నంగా రూ. 5 ల‌క్ష‌లు తేవాల‌ని కొడుతున్నాడు. ఆగ‌స్టు 31న ఆమెను తీవ్రంగా కొట్ట‌డంతో తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ గొడ‌వ‌ల నేప‌థ్యంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తిరుప‌తికి అక్క‌డికి కూడా వెళ్లి ర‌వీణ‌పై హ‌త్యాయ‌త్నం చేశారు. దీంతో మ‌ళ్లీ ఆమె తాళ్ల‌గురిజాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఫిర్యాదు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఆదివారం బెల్లంప‌ల్లిలో ప్రెస్‌క్ల‌బ్‌లో విలేక‌రుల ముందు త‌న గోడు వెల్ల‌బోసుకుంది. న్యాయం కోసం మూడు నెలల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా తమ గోడును పట్టించుకోవడం లేదని వాపోయింది. పోలీసుల నిర్ల‌క్ష్యం వల్ల తన భర్త తిరుపతి తరచుగా ఇంటికి తాగొచ్చి కొడుతున్నాడని తెలిపారు. తన భర్త తిరుపతి పై చర్యలు తీసుకుంటే త‌న‌కు ఇన్ని ఇబ్బందులు ఉండేవి కావని తెలిపారు. పోలీసుల నిర్లక్ష్యం వల్ల తన ప్రాణానికి ముప్పు ఉందని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తన భర్త పై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like