యాజ‌మాన్య నిర్ల‌క్ష్యంతో కార్మికుల‌కు ఇబ్బందులు

The TBGKS leader is angry at the negligence of the Singareni:సింగ‌రేణి యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంతో కార్మికుల‌కు తీవ్ర ఇబ్బందులు క‌లుగుతున్నాయ‌ని టీబీజీకేఎస్ బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్య‌క్షుడు మ‌ల్రాజు శ్రీ‌నివాస్ ఆరోపించారు. ఆయ‌న బుధ‌వారం మాదారం సివిల్ డిపార్ట్మెంట్ ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ సివిల్ డిపార్ట్మెంట్ పరిధిలో భద్రపరిచిన పైపులు దొంగతనం జరిగాయ‌ని, క‌నీసం ప‌ట్టించుకోక‌పోవ‌డం యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌మ‌న్నారు. కొన్ని పైపులు దొంగ‌త‌నం జ‌రిగాయ‌ని మిగ‌తా వాటినైనా సుర‌క్షితంగా ఉండేలా చూడాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఎంవీకే 1 ఇంక్లైన్ నుంచి మాదారం టౌన్ షిప్ కి నీటి సరఫరా కోసం కాంట్రాక్టర్ కి రూ. 3 లక్షలు కేటాయించార‌ని అన్నారు.

అదేవిధంగా రూ. 10 ల‌క్ష‌ల విలువ చేసే మెటీరియ‌ల్ సైతం స‌ర‌ఫ‌రా చేశార‌ని తెలిపారు. ఇంత చేసినా ఆ పైప్‌లైన్ నిరుప‌యోగంగా ఉంచార‌ని ఇది ఏ మేర‌కు సమంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు. అటు కొత్త పైప్‌లైన్ నిరుప‌యోగంగా ఉండి, ఇటు పాత పైప్‌లైన్ లో సాంకేతిక సమ‌స్య‌లు త‌లెత్త‌డంతో మాదారం టౌన్ షిప్‌కు స‌క్ర‌మంగా నీటి స‌ర‌ఫ‌రా కావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అధికారులు వెంట‌నే కొత్త పైప్ లైన్ వెంట‌నే ఉప‌యోగంలోకి తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. లేక‌పోతే తెలంగాణ బొగ్గు గ‌నికార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న చేస్తామ‌ని హెచ్చ‌రించారు. ఆయ‌న‌తో పాటు సివిల్ డిపార్ట్‌మెంట్ పిట్ సెక్రటరీ గుజ్జ శ్రీనివాస్, జీఎం కమిటీ మెంబర్ కోగీలాల రవీందర్, మాదారం టౌన్ ఇంచార్జీ రామారావు, సహాయ కార్యదర్శి మాడుపు శివానంద చారి, నాయకులు ఉస్మాన్, దుర్గం అశోక్, రాజ్ కుమార్, రాజేష్, శంకర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like